మన శరీరంలో గుండె, కాలేయం మాదిరిగానే అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. శరీర వ్యర్థాలు ఈ మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ అవుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే శరీరం మొత్తం ఆరోగ్యం చెడిపోతుంది. క్రమబద్ధమైన జీవనశైలి, తప్పుడు ఆహారం కారణంగా కిడ్నీలు దెబ్బతింటాయి. నేటి కాలంలో చాలా మంది కిడ్నీ స్టోన్ సమస్యలతో కూడా బాధపడుతున్నారు. అలాంటప్పుడు ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి..