Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leftover Rice Recipe: మిగిలిన అన్నంతో ఇలా చేసి చూడండి.. టేస్టీ టేస్టీ శనగల పలావ్..

కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా వంట చేసినా అందరూ తిన్న తర్వాత అన్నం మిగిలిపోతూ ఉంటుంది. బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ మిగిలిన అన్నం పారేయడం అంటే బాధకలుగుతుంది..

Surya Kala

|

Updated on: Jul 27, 2023 | 1:20 PM

అయితే వాస్తవానికి రాత్రి మిగిలిన అన్నం పొద్దున్న తినడం ఆరోగ్యాన్నిఇస్తుంది. అయితే మిగిలిన అన్నం  పారేయకుండా ఉండటానికి ఈ చిట్కాలను ఉపయోగించండి. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు.  రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయం.. శనగలతో బిర్యానీ చేసుకోండి. ఇది రుచికి రుచిని ఇస్తుంది. కడుపు నిండిన ఫీలింగ్ కలిగి.. చాలా సేపు ఆకలి వేయకుండా ఉంటుంది.  

1 / 5
ఎవరైనా సరే రోజూ ఓకేలా అన్నం వండలేరు. కొన్ని రోజులు ఎక్కువ, కొన్ని రోజులు తక్కువ అవుతుంది. అయితే అన్నం మిగిలిపోతుంది కదా అంటూ రాత్రి ఎక్కువ తినడం కరెక్ట్ కాదు. ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉంది. చాలా మంది రాత్రి మిగిలిన అన్నంతో మర్నాడు ఉదయం ఫ్రైడ్ రైస్ చేస్తారు. మరికొందరు తర్వాణీ చేసి తింటారు.  

2 / 5
అయితే మిగిలిన అన్నంతో శనగల బిర్యానీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. అన్నంలో కొన్ని ఉల్లిపాయ ముక్కలను వేసి మూతపెట్టి ఉంచండి. 

3 / 5
మీడియం సైజు ఉల్లిపాయను మందపాటి ముక్కలుగా కట్ చేసుకుని ఒక పాన్ ను స్టౌ మీద పెట్టి నూనె వేసి  వేయించండి. గోధుమ రంగులోకి మారిన తర్వాత వాటిని తీసి పక్కకు పెట్టుకోండి. ఒక చెంచా నెయ్యి , ఒక చిన్న చెంచా అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించి.. తర్వాత టమాటా ప్యూరీ వేసి బాగా వేయించండి.  అందులో కాశ్మీరీ కారం, ఉప్పు, కొంచెం బిర్యానీ మసాలా వేసి వేయించండి. 

4 / 5
తర్వాత ఉడకబెట్టిన కాబూలీ శనగలను వేసి బాగా కలపండి. కొంచెం సేపు ఉడికించిన తర్వాత అన్నం వేసి వేయించండి. చివరిగా వేయించిన ఉల్లిపాయ ముక్కలను, కొత్తిమీర తరుగు వేసి.. కొంచెం కొబ్బరి నీళ్లను వేసి  5 నిమిషాలు మూతపెట్టి ఉంచండి. దించే ముందు కొద్దిగా నెయ్యి వేసి దింపేయ్యండి. రైతా కోసం పెరుగులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, కొద్దిగా మిరియాల పొడి కలపండి.  

5 / 5
Follow us