ఏ వయసులోనైనా ఫోకస్‌పై పట్టు సాధించాలంటే.. ఈ 6 పనులు చేయండి
19 March 2025
TV9 Telugu
TV9 Telugu
ఒకే విషయం మీద దృష్టిని లగ్నం చేయడమే ఏకాగ్రత. ఏ పనిలోనైనా మంచి ఫలితాలు సాధించాలనుకుంటే మనసును సంపూర్ణంగా పనిపైనే లగ్నం చేయాలి. అప్పుడే ఆశించిన విజయాలు పొందగలుగుతాం
TV9 Telugu
సామాన్య మానవుడు సైతం ఏకాగ్రచిత్తుడైనప్పుడు ప్రాపంచిక విషయాల్లో, సాహిత్యంలో, ఆధ్యాత్మిక విషయాల్లో అద్భుతమైన కార్యాలు సాధించగలుగుతాడు
TV9 Telugu
దృఢ సంకల్పానికి ఏకాగ్రత తోడైనప్పుడు ఎలాంటి వారైనా తాము కోరుకున్న లక్ష్యాలు సాధిస్తారు. అందుకే ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే ఫోకస్ చాలా అవసరమని పెద్దలు చెబుతారు
TV9 Telugu
అయితే జీవితంలోని ఏ దశలోనైనా ఫోకస్, జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి హార్వర్డ్ యూనివర్సిటీ పవర్‌ఫుల్ చిట్కాలు చెబుతోంది. అవేంటో తెలుసుకుందాం..
TV9 Telugu
కొత్త నైపుణ్యాలు, అభిరుచులు ఎప్పటికప్పుడు నేర్చుకోవడం వంటి మానసిక కార్యకలాపాలు మెదడును పదునుగా ఉంచడంలో సహాయపడతాయి
TV9 Telugu
పజిల్స్ సాల్వ్ చేయడం ద్వారా మెదడును సవాలు చేయడం వల్ల మెదడు కణాల సంభాషణను ప్రోత్సహిస్తుంది. తద్వారా జ్ఞాపకశక్తి బలపడుతుంది
TV9 Telugu
భిన్న చిత్రాలను వాసనలతో జత చేయడం వల్ల వాసన లేకపోయినా వాటిని బాగా గుర్తుంచుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. వృద్ధాప్యం గురించి సానుకూలంగా ఆలోచించడం వల్ల జ్ఞాపకశక్తి, అభిజ్ఞా పనితీరు సంరక్షించవచ్చు
TV9 Telugu
ముఖ్యమైన పనుల కోసం మానసికంగా సంసిద్ధంగా ఉండటానికి రిమైండర్‌లు, క్యాలెండర్‌ల వంటి సాధనాలను ఉపయోగించాలి. విషయాలను బిగ్గరగా చెప్పడం లేదా వాటిని రాయడం వల్ల జ్ఞాపకశక్తి బలోపేతం అవుతుంది