- Telugu News Photo Gallery Itchy Ears: Why Do My Ears Itch? Know Different Reasons Behind Ear Itching
Itchy Ears: మీకూ మాటిమాటికీ చెవిలో దురద పెడుతుందా? పొరబాటున కూడా ఇలా చేయకండి
చాలా మందికి చెవి దురద సమస్య పదేపదే వేదిస్తుంటుంది. దీంతో వారు ENT నిపుణులను ఆశ్రయిస్తుంటారు. ఈ సమస్య వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. కొందరికి చెవి బయట, కొందరికి లోపల దురద ఉంటుంది. అసలు చెవి దురద ఎందుకు వస్తుందంటే..
Updated on: Jul 07, 2024 | 8:20 PM

చాలా మందికి చెవి దురద సమస్య పదేపదే వేదిస్తుంటుంది. దీంతో వారు ENT నిపుణులను ఆశ్రయిస్తుంటారు. ఈ సమస్య వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. కొందరికి చెవి బయట, కొందరికి లోపల దురద ఉంటుంది. అసలు చెవి దురద ఎందుకు వస్తుందంటే..

బయటి నుంచి లోపలికి వెళ్లే చెవి మార్గంలో చాలా మందికి దురద వస్తుంది. చెవిలో ఆ భాగం పొడిగా ఉంటే దురద వస్తుంది. స్నానం చేసే సమయంలో చెవి మూసుకుపోయినా, చెవిలో నీరు చేరినా దురద వస్తుంది. ఇది చర్మ వ్యాధికి దారి తీయడంతో.. చాలా మందికి చెవులు దురదగా ఉంటాయి.

చెవిపోటుతో సమస్య ఉంటే, రోజంతా చెవిలో దురద సంభవించవచ్చు. చెవిలో రంధ్రం ఉన్నట్లయితే లేదంటే చెవిలో ఇన్ఫెక్షన్ ఉన్నా చెవిలో నిరంతరం దురద వస్తుంది.

చాలా మంది ఇయర్ బడ్స్, పక్షి ఈకలు, పెన్-పెన్సిల్స్‌తో చెవులు తిప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్‌కి దారి తీస్తాయి. వీటి కారణంగా చెవులు దురదకు దారితీస్తాయి.

కానీ చెవిలో దురద ఎక్కువగా ఉంటే.. చెవిలో ఏదైనా భాగం ఎర్రగా మారితే సొంత వైద్యాలు చేసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం మర్చిపోకూడదు.