AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్ ఉన్నవారు పచ్చి కొబ్బరి తింటే ఏమవుతుంది..? డాక్టర్లు చెప్పింది వింటే అవాక్కే..

మన భారతీయ ఇళ్లలో శుభకార్యం ఏదైనా, వంట ఏదైనా కొబ్బరికాయ ఉండాల్సిందే. కొబ్బరి చట్నీ అంటే అందరికీ ఇష్టమే. అయితే డయాబెటిస్ ఉన్నవారు మాత్రం పచ్చి కొబ్బరి తినాలంటే భయపడుతుంటారు. కొబ్బరి తింటే షుగర్ లెవల్స్ పెరిగిపోతాయా? అనే ప్రశ్న వారిని ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. కానీ వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పచ్చి కొబ్బరి మధుమేహ వ్యాధిగ్రస్తులకు శత్రువు కాదు.. అది ఒక గొప్ప వరం.

Krishna S
|

Updated on: Jan 27, 2026 | 5:43 PM

Share
చాలామంది కొబ్బరిలో కొవ్వు ఉంటుందని భయపడతారు. కానీ పచ్చి కొబ్బరిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా అదుపులో ఉంటాయి.

1 / 5
పచ్చి కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అనే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. వీటిని తిన్నప్పుడు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది, దీనివల్ల మాటిమాటికీ ఆకలి వేయదు.
అధిక బరువు తగ్గాలనుకునే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక అద్భుతమైన ఎంపిక.

పచ్చి కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అనే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. వీటిని తిన్నప్పుడు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది, దీనివల్ల మాటిమాటికీ ఆకలి వేయదు. అధిక బరువు తగ్గాలనుకునే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక అద్భుతమైన ఎంపిక.

2 / 5
ఎంత తినాలి?: పచ్చి కొబ్బరి మంచిదే కదా అని విపరీతంగా తినకూడదు. ఎందుకంటే ఇందులో కేలరీలు, సంతృప్త కొవ్వు కూడా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజుకు 2 నుండి 3 చిన్న ముక్కలు మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. డయాబెటిస్ ఉన్నవారికి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి కొబ్బరిని పరిమితంగానే తీసుకోవాలి.

3 / 5
పచ్చి కొబ్బరిని బెల్లం లేదా చక్కెరతో కలిపి స్వీట్ల రూపంలో తినకూడదు. చట్నీలు చేసేటప్పుడు ఉప్పు పరిమాణం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎండిన కొబ్బరి కంటే పచ్చి కొబ్బరిలో పోషకాలు ఎక్కువ, చక్కెర ప్రభావం తక్కువ. ఆ రోజు వంటల్లో ఇప్పటికే కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటే, ఆ రోజు కొబ్బరిని మానేయడం ఉత్తమం.

4 / 5
పచ్చి కొబ్బరిని మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇది కేవలం షుగర్ కంట్రోల్ చేయడమే కాదు మీ శరీర జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఏదైనా మార్పు చేసే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకండి.

5 / 5