భర్త భార్య పాదాలను తాకడం మంచిదేనా?
హిందూ సాంప్రదాయంలో అనేక నియమ, నిబంధనలు ఉంటాయి. వాటిని ఎప్పుడూ విస్మరించకూడదు అంటారు. ముఖ్యంగా భర్త భార్య కాళ్లను తాకకూడదు అంటారు మన పెద్దవారు. కాగా, భర్త భార్య కాళ్లను ఎందుకు తాకకూడదు? తాకితే ఏమౌతుందో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Updated on: Jun 22, 2025 | 5:50 PM

హిందూ సాంప్రదాయంలో అనేక నియమాలు ఉంటాయి. వాటిని ఎప్పుడూ విస్మరించకూడదు అంటారు. ముఖ్యంగా భర్త భార్య కాళ్లను తాకకూడదు అంటారు. కాగా, భర్త భార్య కాళ్లను ఎందుకు తాకకూడదు? తాకితే ఏమౌతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

వివాహం జరిగిన తర్వాత భార్య తప్పకుండా భర్త కాళ్లకు నమస్కరించాలి. దీని వలన ఆమెకు అదృష్టం కలిసి వస్తుంది. అంతే కాకుండా సౌభాగ్యవతిగా ఉంటుంది అంటుంటారు. అంతేకాకుండా భార్య కంటే భర్త పెద్దవాడు కాబట్టి పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిదని చెప్తారు. అదే విధంగా ఎట్టిపరిస్థితుల్లో భర్త భార్య కాళ్లు తాకకూడదు అంటారు.

ఎందుకంటే? భర్త భార్యకంటే చాలా పెద్దవాడు కాబట్టి. కానీ కొన్ని సార్లు భర్త భార్య పాదాన్ని తాకడంలో తప్పులేదంట. ఎందుకంటే? ఇద్దరి మధ్య మంచి బంధం ఉండి, భర్త తన అహాన్ని విడిచి పెట్టి భార్య పాదాన్ని తాకడం వలన అది తన భార్య పట్ల ఎక్కువ బాధ్యతను చూపిస్తున్నట్లేనంట. అంతే కాకుండా తన భాగస్వామిపై ఆ కూడా ఆ వ్యక్తికి ఎనలేని ప్రేమ ఉన్నట్లు అర్థం అంట.

అంతే కాకుండా భర్త తన భార్యకాళ్లను తాకడం వలన అది భాగస్వామిపై ప్రేమనే కాకుండా, దీని వలన అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయంట. కాగా, భర్త భార్య కాళ్లను తాకడం వలన కలిగే ప్రయోజనాలు చూద్దాం.. భర్త భార్య కాళ్లను తాకడం అనేది మంచిదంట. జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలి అనుకునే వ్యక్తులు లేదా, రోజూ ఆనందకరమైన జీవితాన్ని కోరుకునే వారు ప్రతి రోజూ ఉదయం తన భార్య పాదాలను తాకడం చాలా మంచిదంట.

దీని వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలగడమే కాకుండా, ఇంట్లో సంపద, ఆనందం వ్రేయస్సు కలుగుతుందని చెబుతున్నారు పండితులు. అలాగే వీరి జీవితంలో దు:ఖానికి చోటు ఉండదంట. ఎందుకంటే వీరు చాలా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారంట. అలాగే, హిందూ మతం ప్రకారం, భర్త తన భార్య పాదాలను మాత్రమే కాకుండా, ఆమె అరచేతులను కూడా తాకాలి. ఇది వారి అదృష్టాన్ని పెంచుతుందని చెబుతున్నారు పండితులు.



