- Telugu News Photo Gallery Inspiring Story: UP IAS Divya Mittal Success Story of Mirzapur dm upsc tips in telugu
IAS Success Story: భర్త ప్రోత్సాహంతో లక్షల జీతం ఉద్యోగానికి గుడ్ బై.. కోచింగ్ లేకుండానే ఐఏఎస్ అయిన దివ్య మిట్టల్
యూపీలోని మీర్జాపూర్ జిల్లా డీఎం ఐఏఎస్ అధికారి దివ్య మిట్టల్ సివిల్ సర్వీస్‌లో చేరిన కథ నేటి యువతికి చాలా ఉత్తేజకరమైనది. స్ఫూర్తివంతమైంది.
Updated on: Jan 21, 2023 | 6:21 PM

దివ్య మిట్టల్ ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. సివిల్ సర్వీస్ అధికారిగా ఆమె ప్రయాణం నేటి తరానికి చాలా స్ఫూర్తినిస్తోంది. వాస్తవానికి దివ్య భర్త ఐఏఎస్ అధికారి. తన భర్త ఐఏఎస్ అధికారిగా చేస్తున్న సేవలు ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో దివ్య లండన్‌లో తాను చేస్తున్న లక్ష రూపాయల ఉద్యోగాన్ని వదిలిపెట్టి.. ఆపై IAS కావాలని నిర్ణయించుకున్నారు.

దివ్య 2013లో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ప్రస్తుతం దివ్య యూపీలోని మీర్జాపూర్ జిల్లాకు జిల్లా మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీర్జాపూర్ డీఎం కంటే ముందు ఆమె సంత్ కబీర్ నగర్ డీఎంగా కూడా పనిచేశారు. IAS దివ్య మిట్టల్ జీవితం ప్రేరణతో నిండి ఉంది.

IAS అధికారి కాకముందు.. ఆమె లండన్‌లో మంచి ఉద్యోగం చేస్తోంది. భారీగా జీతం వచ్చేది. అయితే.. కాలం ఆమె జీవిత దృక్పథంలో మార్పు తెచ్చింది. దీంతో దివ్య లండన్ నుండి భారతదేశానికి వచ్చి ఐఎఎస్ ఆఫీసర్ గా ఎంపికయ్యారు.

భారత్ దేశానికి తిరిగి వచ్చిన తర్వాత దివ్య విదేశాల్లో ఉద్యోగం కాకుండా దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. IAS దివ్య మిట్టల్ బరేలీ డెవలప్‌మెంట్ అథారిటీగా,జాయింట్ MD, UPSIDA, CDO, మీరట్ , సిధౌలి వంటి ప్రాంతాల్లో ముఖ్యమైన పోస్టులను కూడా నిర్వహించారు.

ఉద్యోగంలో చేరినప్పటి నుండి ఆమె చాలా ప్రతిభావంతులైన ఐఎఎస్ అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. ముస్సోరీలో శిక్షణ తీసుకునే సమయంలో ఆమె అద్భుతమైన ప్రదర్శనకు అశోక్ బంబావాలే అవార్డు కూడా లభించింది. దివ్య మొదటి నుంచి చదువులో దిట్ట. IIT ఢిల్లీ నుండి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకుని.. ఆపై IIM బెంగళూరు నుండి MBA పూర్తి చేశారు. ఈ రెండు విద్యా సంస్థలు ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్యా సంస్థలుగా పరిగణించబడుతున్నాయి.

సివిల్ సర్వీసెస్‌లో చేరడానికి ముందు దివ్య లండన్‌లో డెరివేటివ్స్ ట్రేడర్‌గా పనిచేశారు. దివ్య ఐఏఎస్‌గా మారడానికి కారణం ఆమె భర్త.. దివ్య మిట్టల్ భర్త గగన్‌దీప్ సింగ్ కాన్పూర్‌లో ఐఏఎస్ అధికారి. దీంతో దివ్య సివిల్ సర్వీస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.

గగన్‌దీప్ ఐఏఎస్ ఆఫీసర్ కంటే ముందు ఇంజనీర్‌గా పనిచేశారు. బాగా స్థిరపడిన కెరీర్‌ని వదిలి సివిల్ సర్వీస్‌లో చేరడం దివ్యకు అంత ఈజీ కాలేదు. అయితే ఐఏఎస్ కావాలనే తన కలను మాత్రం వదులుకోనని మనసులో నిశ్చయించుకున్నారు.

లండన్ లో తమ ఫ్యామిలీకి ఆర్ధిక ఇబ్బందులు ఎప్పుడూ ఎదురు కాలేదని దివ్య ఒకసారి చెప్పారు. అయితే ఎప్పుడూ తాను ఇండియాను మిస్సవున్నానని ఫీల్ అయ్యేదానినని తెలిపారు. దీంతో స్వదేశానికి వచ్చి తనకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన యుపిఎస్‌సిని ఛేదించడానికి దివ్య, గగన్‌దీప్ కోచింగ్ తీసుకోలేదు. గగన్‌దీప్ సింగ్ 2011లో యుపిఎస్‌సిలో ఉత్తీర్ణత సాధించగా, రెండేళ్ల తర్వాత 2013లో దివ్య విజయం సాధించారు. భర్త భర్తలు ఇద్దరూ యూపీ కేడర్‌లో విధులను ఉన్నారు.




