- Telugu News Photo Gallery If you eat these foods simply, you will look younger, Check Here is Details in Telugu
Young Looking: సింపుల్‌గా ఈ ఆహారం తినండి.. ఎంత వయసు పెరిగినా యంగ్‌గా కనిపిస్తారు..
మెరిసే అందమైన చర్మం కావాలని అందరూ అనుకుంటారు. చామన ఛాయగా ఉన్నా కూడా ముఖంలో గ్లో ఉంటే.. సెంటరాఫ్ ఆట్రాక్షన్ మీరే అవుతారు. కాబట్టి కలర్ కంటే ముందు ముఖంలో గ్లో ముఖ్యం. అదే విధంగా వయసు పైనబడుతున్నా కూడా యంగ్ లుక్‌లో కనిపించాలని అనుకుంటారు. అలాంటి వారు ఈ ఫుడ్స్ తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అందాన్ని పెంచడంలో విటమిన్ కె కూడా ఎంతో చక్కగా హెల్ప్ చేస్తుంది. మీ డైట్‌లో విటమిన్ కె ఉండే ఆహారాలను చేర్చుకుంటే..
Updated on: Aug 13, 2024 | 2:49 PM

మెరిసే అందమైన చర్మం కావాలని అందరూ అనుకుంటారు. చామన ఛాయగా ఉన్నా కూడా ముఖంలో గ్లో ఉంటే.. సెంటరాఫ్ ఆట్రాక్షన్ మీరే అవుతారు. కాబట్టి కలర్ కంటే ముందు ముఖంలో గ్లో ముఖ్యం. అదే విధంగా వయసు పైనబడుతున్నా కూడా యంగ్ లుక్‌లో కనిపించాలని అనుకుంటారు. అలాంటి వారు ఈ ఫుడ్స్ తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి.

అందాన్ని పెంచడంలో విటమిన్ కె కూడా ఎంతో చక్కగా హెల్ప్ చేస్తుంది. మీ డైట్‌లో విటమిన్ కె ఉండే ఆహారాలను చేర్చుకుంటే.. మీ చర్మం అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. వయసు పైబడినా కూడా యంగ్ లుక్‌లో మెరిసి పోతారు.

అదే విధంగా మీ వయసు తగ్గించేలా చేయడంలో బ్రోకలీ కూడా చక్కగా హెల్ప్ చేస్తుంది. ఇందులో చర్మానికి కావాల్సిన విటమిన్ ఎ, సి, జింక్ అనేవి పుష్కలంగా అందుతాయి. ఇవి వయసు తొందరగా పెరగకుండా, యంగ్ లుక్‌లో కనిపించేలా చేయడంలో సహాయ పడతాయి.

చర్మాన్ని అందంగా మార్చడంలో పాలకూర కూడా హెల్ప్ చేస్తుంది. ఇందులో కూడా విటమిన్లు ఎ, బి, సి, కెలు లభిస్తాయి. ప్రతి రోజూ ఒక చిన్న గ్లాస్ అయినా పాలకూర రసం తాగితే.. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి. మీ స్కిన్ అనేది బ్రైట్‌గా, గ్లోయింగ్‌గా కనిపిస్తుంది.

దానిమ్మ పండు కూడా మిమ్మల్ని యవ్వనంగా ఉంచడంలో సహాయ పడుతుంది. ఈ పండులో యాంటీ ఏజింగ్ గుణాలు అనేవి ఉంటాయి. అలాగే విటమిన్ కె, సి, కొల్లాజెన్ ఉంటాయి. ఇవి చర్మంపై వృద్ధాప్య ఛాయలను త్వరగా రానివ్వకుండా కాపాడతాయి. అంతే కాకుండా మీ చర్మాన్ని మెరుస్తూ కనిపించేలా చేస్తాయి.




