- Telugu News Photo Gallery If you eat these because they taste good, you're putting your kidneys at risk
Kidney Care: రుచిగా ఉన్నాయ కదా అని ఇవి తినేస్తే మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్టే..
శరీరంలో ఉన్న భాగాల్లో కిడ్నీ చాలా ముఖ్యం.ఇలాంటి సమయంలో కిడ్నీల ఆరోగ్యం గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. లేదంటే తీసుకునే ఆహారం కిడ్నీ సమస్యలు, వ్యాధుల ప్రమాదానికి కారణం అవుతుంది. డయాబెటిస్, బీపీ ఉన్నవారు కిడ్నీ వ్యాధులకు అవకాశం ఎక్కువగా ఉంది. కిడ్నీ శరీరం ఆరోగ్యం కోసం కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో వ్యర్థాలను, అదనపు ద్రవాన్ని తొలగించడంలో సహాయపడతాయి. రక్తం సరఫరాకి అవసరమయ్యే నీరు, లవణాలు, ఖనిజాలను నిర్వహించడంలో సహాయపడతాయి. అయితే ఈ 5 ఆహారాల అధికంగా తీసుకుంటే కిడ్నీలు దెబ్బతింటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jun 23, 2025 | 9:30 PM

మయోన్నైస్: సలాడ్ లేదా శాండ్‌విచ్‌లో కోసం మయోన్నైస్ ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా తీసుకుంటే అనే సమస్యలు వస్తాయి. శాకాహార ఫుడ్ పోషకాలను ఇది పాడు చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ మయోనైస్‌లో 103 కేలరీలతో పాటు సంతృప్త కొవ్వు కూడా అధిక మొత్తంలో ఉంటుంది. దీని కారణం బరువు మెరగడమే కాదు కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి. అందుకే దీన్ని ఆరోగ్యకరమైన గ్రీక్ పెరుగుతో భర్తీ చేయండి.

ప్రాసెస్ చేసిన ఆహారాలు: ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధి చెందుతుంది. ఈ ఆహారాలలో చక్కెర, సోడియం, కొవ్వు అధికంగా ఉంటాయి. దీని కారణం మూత్రపిండాలు దెబ్బతింటాయి.

సోడా: సోడాలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. అస్సలు ఎలాంటి పోషక విలువలు ఇందులో లేవు.ఇందులో ఉన్న అదనపు కేలరీలు కారణంగా బరువు పెరుగుతారు. దీన్ని తరుచూ తీసుకోవడం వల్ల ఎముకల బోలుగా మారతాయి. సోడా వినియోగం మూత్రపిండాల వ్యాధి, జీవక్రియ సిండ్రోమ్, దంత సమస్యలను కారణం అవుతుంది.

ప్రాసెస్ చేసిన మాంసం: ప్రాసెస్ చేసిన మాంసాంలో సోడియం అధికంగా ఉంటుంది. దీన్ని తరుచూ తీసుకుంటే రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. దీన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని పడుతుంది. జంతు ప్రోటీన్లను అతిగా తింటే కిడ్నీ వ్యాధి బారిన పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

డీ ఫ్రై చేసిన బంగాళదుంపలు: బంగాళదుంపలతో చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరానికి హాని కలుగుతుంది. వీటి కారణంగా విలువైన మూత్రపిండాలు ప్రమాదంలో పడుతుంది. గుండె, కిడ్నీ వ్యాధులు రాకుండా ఉండాలంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. బంగాళాదుంపలలో పొటాషియం అధికంగా ఉన్న కారణంగా మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు వీటిని తగ్గించాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.




