- Telugu News Photo Gallery If you do this with coffee powder, the hair will grow thicker, Check here is details in Telugu
Coffee Powder for Hair: జుట్టు ఒత్తుగా పెరగాలా.. కాఫీ పౌడర్‌తో ఇలా చేయండి!
తలనొప్పిగా ఉంటే మంచి స్ట్రాంగ్ కాఫీ తాగుతారు. అలాగే అందాన్ని పెంచుకోవడంలో కూడా కాఫీ పౌడర్ చక్కగా పని చేస్తుంది. అందాన్ని పెంచడానికే కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా కాఫీ పౌడర్ చక్కగా పని చేస్తుంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓ గిన్నె తీసుకుని అందులో నీటిని పోసి స్టవ్ మీద పెట్టాలి. అందులో కాఫీ పౌడర్ కూడా వేసి వేడి చేయాలి. ఇప్పుడు డికాషన్‌లా మారుతుంది. ఈ నీటిని తల స్నానం చేసేటప్పుడు..
Updated on: Apr 06, 2024 | 2:23 PM

తలనొప్పిగా ఉంటే మంచి స్ట్రాంగ్ కాఫీ తాగుతారు. అలాగే అందాన్ని పెంచుకోవడంలో కూడా కాఫీ పౌడర్ చక్కగా పని చేస్తుంది. అందాన్ని పెంచడానికే కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా కాఫీ పౌడర్ చక్కగా పని చేస్తుంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం.

ఓ గిన్నె తీసుకుని అందులో నీటిని పోసి స్టవ్ మీద పెట్టాలి. అందులో కాఫీ పౌడర్ కూడా వేసి వేడి చేయాలి. ఇప్పుడు డికాషన్‌లా మారుతుంది. ఈ నీటిని తల స్నానం చేసేటప్పుడు.. జుట్టును క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే కుదుళ్లు బలపడి.. రాలడం తగ్గుతుంది.

మరో టిప్ ఏంటంటే.. మరిగించిన కాఫీ నీటిని.. పెరుగు లేదా తేనె, వెన్నతో కలిపి తలకు పట్టించి.. ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా ఓ 15 నిమిషాల తర్వాత హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. దీని వల్ల జుట్టు షైనీగా, స్ట్రాంగ్‌గా మారుతుంది.

కాఫీ పౌడర్‌ను.. కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్‌తో కలిపి.. స్కాల్ఫ్‌పై సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల తలపై రక్త ప్రసరణ మెరుగు పడి.. జుట్టు కుదుళ్లు బలంగా మారాతాయి. దీంతో జుట్టు బలపడి.. పెరుగుతుంది.

తెల్ల జుట్టుతో బాధ పడేవారు.. కాఫీ పౌడర్‌తో నల్లగా మార్చుకోవచ్చు. తలస్నానం చేసిన తర్వాత.. కాఫీ పౌడర్‌ను జుట్టుకు అప్లై చేసి.. పది నుంచి 15 నిమిషాలు అలానే ఉంచి, శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తు.. జుట్టు నల్లబడుతుంది.




