పొట్ట గుట్టలా మారిందని బాధపడుతున్నారా..? డోంట్ కేర్.. ఈ సింపుల్ టిప్స్‌తో అద్భుతమైన కటౌట్..

సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిలో ప్రధానమైనది ఊబకాయం. ఊబకాయం అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద ముప్పుగా మారుతుంది. బరువు పెరగడంలో ఆహారం మాత్రమే కాదు, జీవనశైలి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

Shaik Madar Saheb

|

Updated on: May 28, 2024 | 9:39 PM

సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిలో ప్రధానమైనది ఊబకాయం. ఊబకాయం అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద ముప్పుగా మారుతుంది. బరువు పెరగడంలో ఆహారం మాత్రమే కాదు, జీవనశైలి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎక్కువ శారీరక శ్రమ లేకుండా చాలా గంటలు కూర్చోవడం, ఆలస్యంగా తినడం, సరైన నిద్ర లేకపోవడం వంటి.. ప్రతి చిన్న విషయం కూడా ఊబకాయం వంటి సమస్యకు దారి తీస్తుంది. ప్రమాదకర సమస్యలకు, రోగాలకు ప్రధాన కారణం ఊబకాయమే..

1 / 6
స్థూలకాయం తర్వాత అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నప్పటికీ, జీవనశైలిలో సరైన మార్పులు చేసుకుంటే ఈ సమస్యల ముప్పు నుంచి బయటపడొచ్చు.. ఈ సందర్భంలో, త్వరగా, ఆరోగ్యకరమైన మార్గంలో బరువు తగ్గాలనుకునే వారు సరైన చిట్కాలు అవలంభించాలి.. వ్యాయామంతోపాటు.. వీటిని అనుసరించడం ద్వారా మీరు ఊబకాయం నుండి మాత్రమే కాకుండా, దానికి సంబంధించిన ఆరోగ్య, మానసిక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు.

2 / 6
తాగునీరు: మీరు బరువు తగ్గడంలో నీరు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం వల్ల మీ శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. శరీరంలో టాక్సిన్స్ కూడా ఎక్కువగా విడుదలవుతాయి. దీంతో బరువు తగ్గడం మరింత సులభతరం అవుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వాటర్ బాటిల్ చేతిలో పెట్టుకుని తాగుతూ ఉండాలి..

3 / 6
నిద్ర అవసరం: క్రమం తప్పకుండా నిద్రపోవడం, సరైన సమయానికి మేల్కొనడం మీ బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తుంది. రాత్రి 10 గంటల తర్వాత మెలకువగా ఉండకుండా ఉండండి. అంతేకాకుండా.. సూర్యోదయం వేళలోనే నిద్ర నుంచి మేల్కొని వ్యాయామం చేయడండి.. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుంది.

4 / 6
ఆహారం: బరువు తగ్గడానికి ఆహారం చాలా ముఖ్యమైన కారకాల్లో ఒకటి. అనారోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్, స్పైసీ ఫుడ్ తినవద్దు. బదులుగా, పోషకమైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తినండి. పోషకాహార నిపుణుడిని సంప్రదించి మీ శరీరానికి తగిన ఆహారాలను ఏర్పాటు చేసుకోవడం మంచిది.

5 / 6
వ్యాయామం: ప్రతిరోజూ ఉదయాన్నే వ్యాయామం చేయడం కూడా బరువు తగ్గేలా చేస్తుంది. ఉదయం, సాయంత్రం కాసేపు నడవడం, యోగా చేయడం లాంటివి బరువు తగ్గేలా చేస్తాయి.

6 / 6
Follow us