AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rosemary Plant: జుట్టు ఎదుగుదలకు ఉపయోగపడే రోజ్మేరీ మొక్క కొమ్మలతో గుబురుగా పెరగాలంటే

ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలడాన్ని అరికట్టి, కొత్త వెంట్రుకలు వేగంగా పెరగడానికి రోజ్మేరీ నూనెలు మరియు హెయిర్ వాటర్ ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. అయితే మార్కెట్లో కొనుగోలు చేసే రోజ్మేరీ ఉత్పత్తుల కంటే ఇంట్లోనే రోజ్మేరీ మొక్కను పెంచుకుని తాజా ఆకులతో హెయిర్ ఆయిల్, హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం.

Phani CH
|

Updated on: Aug 28, 2026 | 1:55 PM

Share
రోజ్మేరీ ఒక అరుదైన సుగంధ ద్రవ్యాల జాతికి చెందిన మొక్క. చాలామందికి ఈ మొక్కను ఇంట్లో పెంచేటప్పుడు ఎండిపోవడం లేదా వేర్లు కుళ్ళిపోయి చనిపోవడం జరుగుతుంటుంది. సరైన మట్టి మిశ్రమం, ఎండ, మరియు చిన్న చిన్న కొమ్మలతోనే రోజ్మేరీని ఎలా గుబురుగా పెంచుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.

1 / 5
రోజ్మేరీ మొక్కను పెంచడానికి విత్తనాల కంటే కొమ్మలు నాటడం అత్యంత సులువైన పద్ధతి. బాగా ముదిరిన గట్టి కొమ్మలను ఎంచుకుని, క్రింది భాగంలో ఒక అంగుళం వరకు ఆకులను తొలగించాలి. ఎర్రమట్టి మరియు కొద్దిగా మేక ఎరువు కలిపిన చిన్న కుండీలో ఈ కొమ్మను కాస్త లోతుగా నాటి నీరు పోయాలి. సుమారు నెల రోజుల్లోనే కొత్త వేర్లు ఏర్పడి కొమ్మ చిగురించడం మొదలవుతుంది.

2 / 5
పాటింగ్ మిక్స్ ముఖ్యమైన 3 సూత్రాలు:  మొదటిది మట్టి మిశ్రమం 40% ఎర్రమట్టి, 40% వర్మీకంపోస్ట్ లేదా మేక ఎరువు, 10% వేపపిండి మరియు నీరు నిలవకుండా జారిపోయేందుకు 10% ఇసుక కలపాలి. రెండోవది రోజ్మేరీ మొక్కకు నీరు నిల్వ ఉండకూడదు. కుండీ అడుగున నాలుగైదు పెద్ద డ్రైనేజ్ రంధ్రాలు ఉండాలి. మట్టి పైపొర పూర్తిగా ఆరినప్పుడు మాత్రమే (2-3 రోజులకు ఒకసారి) నీరు పోయాలి.

3 / 5
మూడవది ఎండ: ఈ మొక్క ఆరోగ్యంగా ఎదగడానికి రోజుకు కనీసం 5 నుండి 6 గంటల పాటు నేరుగా సూర్యరశ్మి తప్పనిసరిగా తగలాలి. నెలకు ఒకసారి ఇచ్చే ప్రత్యేక సేంద్రీయ ఎరువు అయిన పావు కిలో మేక ఎరువు లేదా కంపోస్ట్, ఒక టేబుల్ స్పూన్ వేపపిండి, ఒక టేబుల్ స్పూన్ ఆవపిండి, కొద్దిగా బొగ్గు పొడి మరియు కట్టెల బూడిదను బాగా కలపాలి.

4 / 5
ఈ ఎరువులో కాల్షియం, మెగ్నీషియం, నైట్రోజన్, పొటాషియం వంటి అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మొక్క మొదలుకు కొద్దిగా దూరంగా మట్టిని గుల్ల చేసి ఈ ఎరువును వేసి పైనుంచి మట్టితో కప్పేయాలి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మీ రోజ్మేరీ మొక్క నిత్యం పచ్చదనంతో, ఎంతో గుబురుగా పెరుగుతుంది!

5 / 5
Follow Us