పారాసెటిమాల్ తీసుకున్న వారిలో నాలుగు రోజుల్లోనే రక్తపోటు పెరుగుతున్నట్టు వైద్యులు గుర్తించారు. పారాసెటిమాల్ వాడకంతో హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్స్ 20 శాతం పెరిగినట్లు గుర్తించారు. నిజానికి వ్యక్తిలో గతంలో ఉన్న వ్యాధులు, బరువు, ఎత్తు, వాతావరణం ఆధారంగా మోతాదు నిర్ణయిస్తారు. జ్వరం వచ్చిన 6 గంటల తర్వాత మాత్రమే 500 mg పారాసెటమాల్ తీసుకోవాల్సి ఉంటుంది. మెడిసిన్ ఏదైనా మోతాదుకు మించి వాడితే ప్రమాదమేనని అంటున్నారు వైద్యులు. పారాసెటిమాల్ పుట్టిన బిడ్డ నుండి వందేళ్లు ఉన్న వాళ్ళ వారికి వాడవచ్చు. టైమ్ ప్రకారం 10 మిల్లీగ్రామ్స్ పర్ కిలో వాడవచ్చు. 50mg వరకు వాడవచ్చు. కానీ ఈ మోతాదు మించితే ఎలాంటి వారికైనా ఇబ్బంది తప్పదు అంటున్నారు డాక్టర్ రంగయ్య. మొదటగా లివర్ పై ఎఫెక్ట్ పడుతుంది అని ఇది లాంగ్ టర్మ్ లో ప్రభవం ఉంటుంది అని వైద్యులు తెలిపారు...మరింత మోతాదు పెరిగితే ప్రాణాలకు ప్రమాదం అంటున్నారు వైద్యులు.