Spirituality Tips: మీరు దెయ్యంతో పోరాడినట్టు కల వచ్చిందా!
కలలు రావడం అనేది సర్వ సాధారణమైన విషయం. అయితే అన్ని కలలూ మంచివే కాదు.. పీడ కలలు కూడా ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు భయానకంగా కలలు వస్తాయి. దీంతో నిద్రలో భయపడి పోతూ తుళ్లి పడి లేస్తారు. ఏదో నీడ తరుముతున్నట్టు.. మీపై ఎటాక్ చేస్తున్నట్టు కల వస్తుంది. అలాగే మరి కొన్ని సార్లు ఫన్నీ కలలు కూడా వస్తాయి. దీంతో నిద్రలోనే పకపకమని నవ్వేస్తూంటారు. ఇలా ప్రతీ కలకు ప్రత్యేకమైన అర్థం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతుంది. ఈ కలల గురించి ఎక్కువగా చింతించాల్సిన..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Dec 14, 2023 | 11:30 AM

కలలు రావడం అనేది సర్వ సాధారణమైన విషయం. అయితే అన్ని కలలూ మంచివే కాదు.. పీడ కలలు కూడా ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు భయానకంగా కలలు వస్తాయి. దీంతో నిద్రలో భయపడి పోతూ తుళ్లి పడి లేస్తారు. ఏదో నీడ తరుముతున్నట్టు.. మీపై ఎటాక్ చేస్తున్నట్టు కల వస్తుంది. అలాగే మరి కొన్ని సార్లు ఫన్నీ కలలు కూడా వస్తాయి. దీంతో నిద్రలోనే పకపకమని నవ్వేస్తూంటారు.

ఇలా ప్రతీ కలకు ప్రత్యేకమైన అర్థం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతుంది. ఈ కలల గురించి ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదు. ఆ కలల అర్థాలు తెలుసుకుంటే సరిపోతుంది. చాలా మందిససకి కలలో దెయ్యం కనిపిస్తుందని చాలా మంది చెబుతూ ఉంటారు.

ఇలా కలలో దెయ్యం కనిపిస్తే మాత్రం.. డబ్బును అనవసరంగా పోగొట్టుకుంటారని, పనికి రాని కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారని అర్థం. అంతే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది.

అలాగే మీరు కలలో దెయ్యంతో పోరాడి ఓడించినట్లయితే అది మంచి సంకేతంగా పరిగణిస్తారు. దీనికి అర్థం ఏంటంటే.. మీ జీవితంలోని అడ్డంకుల నుండి మీరు త్వరలోనే విముక్తి పొందుతారు. అంతే కాకుండా జీవితంలో కష్టాలు తీరుతాయని అర్థం చేసుకోవచ్చు.

ఇక మీ కలలో ఎగిరే దెయ్యం కనిపించినట్లయితే.. శత్రువులు మీకు హాని చేస్తారని.. స్వప్న శాస్త్రం చెబుతోంది. ఇలాంటి కలలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని గుర్తించు కోవాలి. అయితే కలలు పగలైనా.. రాత్రైనా ఇలాంటి కలలు రావడం సహజం. కానీ అవి వచ్చే సమయాన్ని బట్టి వాటి ఫలితాలు ఉంటాయని స్వప్న శాస్త్రం చెబుతోంది.





























