- Telugu News Photo Gallery Here are the precautions to take for children's health during the monsoon season!
వర్షకాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
వర్షకాలం వచ్చిందంటే చాలు వ్యాధులు స్వైర విహారం చేస్తుంటాయి. జలుబు, తగ్గు, జ్వరం వంటి అనేక సమస్యలు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా కాలంలో చాలా వరకు పిల్లలు త్వరగా అనారోగ్యానికి గురి అవుతారు. అందువలన ఈ సీజన్‌లో పిల్ల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, వర్షకాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో ఇప్పుడు చూద్దాం
Updated on: Jun 19, 2025 | 1:51 PM

వర్షాకాలంలో పిల్లల పరిశుభ్రతపై తల్లిదండ్రులు చాలా శ్రద్ధతీసుకోవాలంట. ఎందుకంటే వారు ఎక్కువగా బయట, బురదలో ఆడుకుంటుంటారు. కాబట్టి పిల్లల కాళ్లు, చేతులు పదే పదే నీటుగా కడగాలి. ఇది వారిని అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. అదే విధంగా ఈ సీజన్‌లో పిల్లలకు అస్సలే చల్లటి ఆహారం ఇవ్వకూడదు, పోకమైన వేడి వేడి ఆహారాన్నే పెట్టాలి. అలాగే తాజాగా కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు పెట్టడం ఆరోగ్యానికి మరింత మంచిది.

అలాగే, వీలైనంత వరకు మీ పిల్లల ఆరోగ్యమే మీకు ముఖ్యం అనుకుంటే వారికి బయటఫుడ్ అస్సలే పెట్టకూడదు, మీరు కూడా తినకూడదు. ముఖ్యంగా జంక్ ఫుడ్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఎందుకంటే? జంక్ ఫుడ్ అనేది వారిలోని రోగనిరోధక శక్తిని పూర్తిగా తగ్గిస్తుంది. అందుకే అస్సలే వాటిని పిల్లలకు పెట్టకూడదు.పిల్లలు తడిస్తే వెంటనే పొడిబట్టలు వేయాలి. వారు తడి బట్టలు వేసుకొనే ఎక్కువ సేపు ఉండటం వలన జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి.

అలాగే ఇంటి వాతావరణాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే తేమ వలన దోమలు, కీటకాలు ఎక్కువగా పెరుగుతాయి. ఇవి పిల్లలను కుట్టినట్లైతే అనేక విషజ్వరాలు వస్తాయి. దీని వలన పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే వీలైనంత వరకు మీ ఇంటి వాతావరణాన్ని నీట్‌గా ఉంచుకొని, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

వర్షకాలంలో పిల్లలు నీరు తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపరు. కానీ వారికి ప్రతి రోజూ కాచి చల్లార్చిన నీటిని తాగించాలి. ఇది వారి ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కువ నీరు తాగించడం వలన పిల్లల్లో కడుపు సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే ఈ సీజన్‌లో పిల్లలు కంటి నిండా నిద్రపోయేలా చేయాలి. కొంత మంది మొబైల్ ఫోన్‌కు అడక్ట్ అయిపోయి నిద్రపోరు కానీ, మంచి నిద్ర వారిలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందంట

అలాగే ఈ సీజన్‌లో పిల్లలకు జ్వరం లేదా దగ్గు, కడుపు నొప్పి వంటి సమస్యలు రావడం సర్వసాధారణం. అంతే కాకుండా చర్మసమస్యలు కూడా వస్తాయి. అయితే మీ పిల్లలకు తేలికపాటి జ్వరం ఉన్న వెంటనే వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలంట. లేకపోతే పిల్లలు త్వరగా కోలుకోరు. సకాలంలో వైద్యం అందితే వారు త్వరగా కోలుకుంటారు.



