AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరానికి బలం కోడిగుడ్డు.. ప్రతి రోజూ తింటే కలిగే 5 ప్రయోజనాలు ఇవే!

ఆరోగ్యాన్నిచ్చే ఆహారాల్లో గుడ్లు ఒకటి. ఇది పోషకాల గని అంటారు. గుడ్లలో అనేక పోషకాలు, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. అందువలన ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడటమే కాకుండా గుండె ఆరోగ్యానికి , ఎముకల బలానికి, కంటి ఆరోగ్యాన్ని పెంచడానికి గుడ్లు తోడ్పడుతాయి. ఇవే కాకుండా ప్రతి రోజూ ఒక ఉడకబెట్టిన కోడి గుడ్డు తినడం వలన అనేక లాభాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 23, 2025 | 1:52 PM

Share
ఇకపోతే, మధుమేహం ఉన్నవారు కోడి గుడ్ల విషయానికి వస్తే.. వీటిలో బయోటిన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇక గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపదు. దీనివల్ల షుగర్ ఉన్నవారు కూడా మితంగా గుడ్లు తినవచ్చు అంటున్నారు నిపుణులు.

1 / 5
కోడి గడ్డును ఉడక బెట్టి లేదా గిలకొట్టి ఏవిధంగా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే, కానీ ఎక్కువగా బాయిల్డ్ ఎగ్ శరీరానికి చాలా మేలు చేస్తుందంట. ముఖ్యంగా ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. రోజుకు ఒక కోడి గుడ్డు తీసుకోవడం వలన ఇది గుండె పోటు, స్ట్రోక్, లేదా ఇతర హృదయ సంబంధ వ్యాధుల నుంచి కాపాడుతుందంట. అంతే కాకుండా రక్త నాళాల్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో కూడా సహాయపడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
కోడి గుడ్డు గుండె పనితీరును మెరుగు పరచడమే కాకుండా, మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట. ఇది  దడు పనితీరును పెంచుతుంది. మెదడు ఆరోగ్యానికి కీలకమైన పోషకం అయిన కోలిన్ యొక్క ఉత్తమ వనరులలో గుడ్లు ఒకటి. కోలిన్ జ్ఞాపకశక్తి, మానసిక స్థితి,అభిజ్ఞా పనితీరుకు మద్దతు ఇస్తుంది. తగినంత కోలిన్ తీసుకోవడం వల్ల వృద్ధులలో అభిజ్ఞా క్షీణత ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక గుడ్డులో దాదాపు 147 మి.గ్రా. కోలిన్ ఉంటుంది.

3 / 5
 కంటి ఆరోగ్యానికి కూడా గుడ్లు చాలా మంచివి. కంటి సమస్యలతో బాధపడే వారు ప్రతి రోజు ఒక కోడి గుడ్డు తీసుకోవడం వలన ఇది కంటి ఆరోగ్యానికి మెరుగు పరుస్తుంది. ఎందుకంటే గుడ్లలో లుటీన్, జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వయసు సంబంధిత  మాక్యులర్ డీజనరేషన్ కంటి శుక్లం నుంచి రక్షిస్తుంది. అంతే కాకుండా ప్రతి రోజు గుడ్డు తినడం వలన ఇది కంటి చూపు మెరుగు పడేలా చేస్తుంది.

4 / 5
దృఢమైన ఎముకలకు గుడ్లు చాలా మంచివి. ఇందులో విటమిన్ డీ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అంతే కాకుండా కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. అందువలన ప్రతి రోజూ ఒక గుడ్డు తీసుకోవడం వలన ఇది ఎములకు తగినంత డీ విటమిన్ అందించడమే కాకుండా, ఎముకల వ్యాధులను తగ్గిస్తాయి. అలాగే  ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం, గోళ్లను ఆరోగ్యాన్ని  బలపరుస్తాయి. అందుకే ప్రతి రోజు ఒక గుడ్డు తినాలంటారు నిపుణులు.

5 / 5