Eye Care Tips: వర్షాకాలంలో కంటికి రక్షణ ఇచ్చే సూపర్ ఫుడ్ .. కండ్ల కలక వస్తే ఏ చర్యలు తీసుకోవాలంటే..
వర్షాకాలం వచ్చిందంటే చాలు మేమున్నాంటూ ఫ్లూ, దగ్గు, జలుబు వంటి అనేక సీజనల్ వ్యాధులు వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి సీజనల్ వ్యాధుల్లో ఒకటి కండ్ల కలక. అవును వర్షాకాలంలో కండ్లకలకతో పాటు కళ్లు పొడిబారడం, చికాకు, దురద సమస్యలు వస్తాయి. కాబట్టి వర్షాకాలంలో కళ్ల సంరక్షణ చాలా ముఖ్యం. ఈ సందర్భంలో, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.