- Telugu News Photo Gallery Health Tips: These vegetables should not be cooked at all with oil and spices
Healthy Vegetables: ఈ కూరగాయలను నూనె వేసి అస్సలు వండకూడదట.. ఎందుకో తెలుసా?
ఆరోగ్యంగా ఉండాలంటే తాజా కూరగాయలు తినడం చాలా ముఖ్యం. ముఖ్యంగా క్యారెట్, దుంపలు, పాలకూర, బ్రోకలీ వంటి కూరగాయలను తప్పక తీసుకోవాలి. వీటిల్లో వివిధ రకాల విటమిన్లు, ఫైబర్, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని రోజువారీ ఆహారంలో తప్పక చేర్చుకోవాలి. కొన్ని రకాల కూరగాయలను నూనె, సుగంధ ద్రవ్యాలతో అధిక వేడి మీద ఉడికిస్తే వాటి పోషక విలువలను కోల్పోతాయి. అందువలన వీటిని నూనె, సుగంధ ద్రవ్యాలతో..
Updated on: Jun 09, 2024 | 8:07 PM

ఆరోగ్యంగా ఉండాలంటే తాజా కూరగాయలు తినడం చాలా ముఖ్యం. ముఖ్యంగా క్యారెట్, దుంపలు, పాలకూర, బ్రోకలీ వంటి కూరగాయలను తప్పక తీసుకోవాలి. వీటిల్లో వివిధ రకాల విటమిన్లు, ఫైబర్, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని రోజువారీ ఆహారంలో తప్పక చేర్చుకోవాలి. కొన్ని రకాల కూరగాయలను నూనె, సుగంధ ద్రవ్యాలతో అధిక వేడి మీద ఉడికిస్తే వాటి పోషక విలువలను కోల్పోతాయి. అందువలన వీటిని నూనె, సుగంధ ద్రవ్యాలతో అస్సలు వండకూడదు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పోషకాలు అధికంగా ఉండే కూరగాయలను నూనె, సుగంధ ద్రవ్యాలతో వండకూడదు. వాటిని ఉప్పుతో ఉడికించి మాత్రమే తినాలి. అప్పుడే వాటి పోషక విలువలు లభిస్తాయి. అలాంటి వాటిల్లో బ్రోకలీ ముఖ్యమైనది. ఇది అత్యంత పోషకమైన కూరగాయలలో ఒకటి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. దీన్ని మసాలా దినుసులతో వండడానికి బదులు, ఉడకబెట్టి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

పాలకూరతో సహా వివిధ ఆకుకూరల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని నూనె, మసాలా దినుసులతో వండడం కంటే వాటిని కాస్త ఉడకబెట్టి తింటే కంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే రక్తహీనత నివారణలో బిట్ రూట్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అయితే దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ మసాలా దినుసులతో వండకూడదు. అప్పుడే దీనివల్ల ప్రయోజనం పొందుతారు. బీట్‌రూట్ తింటే హిమోగ్లోబిన్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి

రక్తహీనత వల్ల వచ్చే ఎముకల సమస్యలకు క్యారెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని కూడా ఉడికించి కాకుండా ఉడకబెట్టి తింటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. చాలామంది క్యారెట్‌లను పచ్చిగా తింటారు. ఇలా తింటే మరీ మంచిది.

వివిధ కూరగాయలతో పాటు బంగాళదుంపలు చాలా మంది రోజువారీ ప్రధాన ఆహారాలలో ఒకటి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు బంగాళదుంపలు తినకూడదు. బంగాళదుంపలను కూరగా వండటం కంటే ఉడకబెట్టి తినడం సరైన మార్గం.





























