Knee Pain: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలు పాటించండి..
కీళ్ల నొప్పులు వచ్చినవారు నొప్పులు అనుభవించేవారి బాధ వర్ణనాతీతం. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే చాలామంది ఎక్కువగా పెయిన్ కిల్లర్స్‌ను వినియోగిస్తుంటారు. అయితే వాటికి బదులు కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిదని చెబుతున్నారు వైద్యులు. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగాలంటే ముఖ్యమైనది వాకింగ్. ప్రతిరోజు కొంతసేపు అలా నడిస్తే కచ్చితంగా కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం ఉంటుంది. అంతేకాదు స్విమ్మింగ్ చేసినా కూడా శరీరానికి వ్యాయామం చేసినట్లే. దీనివల్ల కూడా కీళ్ల నొప్పులు తగ్గుతాయని చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




