Bottle Gourd: సొరకాయను వీటితో కలిపి తిన్నారో యమలోకానికి పార్సిల్ పక్కా! ఒంట్లో విషంగా మారిపోతాయ్..
ఆరోగ్యానికి చాలా మేలు చేసే కూరగాయలలో సొరకాయ ఒకటి. ఇది శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లను అందిస్తుంది. సాధారణంగా సొరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మలబద్ధకం వంటి సమస్యలను నివారించడానికి సహాయపడతాయి. కానీ సొరకాయతో పాటు కొన్ని ఆహారాలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు దాడి చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు..
Updated on: Feb 27, 2025 | 1:14 PM

bottle gourd

అంతేకాకుండా సొరకాయలో నీరు పుష్కలంగా ఉంటుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ కొన్ని ఆహార పదార్థాలను సొరకాయతో కలిపి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

సొరకాయతో కాలీఫ్లవర్ తినడం మంచిది కాదు. ఈ రెండు కూరగాయలను కలిపి తినడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఫలితంగా ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు సంభవించవచ్చు. కాబట్టి వీటిని కలిపి తినకపోవడమే మంచిది.

సొరకాయతో కాకరకాయ తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ రెండు కూరగాయలను కలిపి తినడం వల్ల శరీరం విషపూరితం అవుతుందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా, జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కలిపి తినకపోవడమే మంచిది.

ఆయుర్వేదం ప్రకారం పాలతో పొట్లకాయ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. పాలు, పొట్లకాయ కలిపి తీసుకుంటే శరీరంలో వివిధ రసాయన ప్రతిచర్యలు జరుగుతాయి. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఈ రెండింటినీ ఏ వంటలోనూ కలపకూడదు. అలాగే బీట్‌రూట్‌తో పాటు సొరకాయ తినడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు శరీరంపై కనిపిస్తాయి. కాబట్టి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ రెండు కూరగాయలను కలిపి తినకపోవడమే మంచిది.




