Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ అరటిపండు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..? ఇకపై వదిలితే ఒట్టు..!

దాదాపు ప్రతి వ్యక్తి ఇష్టంగా తినే ఫ్రూట్‌ అరటి పండు..! పేద మధ్య తరగతి ప్రజలందరికీ అందుబాటు ధరలో లభించే ఈ పండు ప్రజలు దాదాపు ప్రతిరోజూ తింటారు. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. దీని కారణంగా ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా కూడా చెబుతారు. అయితే, ఇటీవలి కాలంలో మార్కెట్లో ఎర్రటి అరటి పండ్లు కూడా కనిపిస్తున్నాయి. ఈ ఎర్ర అరటి ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ రెడ్‌ కలర్‌ బనానా వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Sep 05, 2024 | 12:03 PM

Share
ఎర్ర అరటిపండ్లు ప్రధానంగా ఆస్ట్రేలియాలో పండిస్తారు.వెస్టిండీస్, మెక్సికో, అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో కూడా సాగు చేస్తారు. భారతదేశంలో ఇది ప్రధానంగా కర్ణాటక చుట్టుపక్కల ప్రాంతాలలో సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మార్కెట్లో విరివిగా లభిస్తోంది. మన అనారోగ్య సమస్యలన్నింటికి చెక్ పెడుతుంది. ముఖ్యంగా డయాబెటిస్‌ రోగులకు చక్కగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

1 / 6
ఈ ఎర్ర అరటిలో ఫ్రక్టోజ్, సుక్రోజ్, గ్లూకోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి మనల్ని రోజంతా ఉత్సహంగా ఉండేలా చేస్తాయి. అలాగే, ఈ ఎర్ర అరటిపండులో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది ట్రిప్టోఫాన్‌ను సెరోటోనిన్‌గా మారుస్తుంది. సెరోటోనిన్ మిమ్మల్ని సంతోషంగా ఉంచడంలో సహాయపడే అనుభూతిని కలిగించే హార్మోన్.

2 / 6
సాధారణ అరటిపండ్లతో పోలిస్తే ఎర్రటి అరటిపండ్లలో ఎక్కువ మొత్తంలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టే సమస్యను నివారిస్తుంది. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, అనేక ఖనిజాలు ఇందులో లభిస్తాయి. ఎర్రటి అరటిపండు రుచి సాధారణ అరటిపండుతో సమానంగా ఉంటుంది. కానీ దాని వాసన బెర్రీ లాంటి పండులా ఉంటుంది.

3 / 6
ఎర్ర అరటిపండును రోజూ తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. ఎముకలకు మేలు చేస్తుంది. అంతేకాదు.. ఎర్రటి అరటిపండు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచుతుంది. తద్వారా రక్తహీనత నుండి ఉపశమనాన్ని అందిస్తుంది .

4 / 6
ఎర్రటి అరటిపండులో సమృద్ధిగా ఉండే పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. రక్తపోటును నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఎర్రటి అరటిపండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం కారణంగా స్మోకింగ్‌ అలవాటు మానేయడంలో సహాయపడుతుంది.

ఎర్రటి అరటిపండులో సమృద్ధిగా ఉండే పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. రక్తపోటును నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎర్రటి అరటిపండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం కారణంగా స్మోకింగ్‌ అలవాటు మానేయడంలో సహాయపడుతుంది.

5 / 6
ఎర్ర అరటిపండులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ మలబద్ధకం, పైల్స్ నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నొప్పితో పాటు గుండెల్లో మంటను నయం చేస్తుంది. కాబట్టి, మీకు కడుపునొప్పి, గుండెల్లో మంట ఉన్నప్పుడు, రెడ్‌ బనానా జ్యూస్‌ తాగటం చాలా మంచిది.

6 / 6