AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nadi Shodhana Pranayama: నాడీ శోధన ప్రాణాయామంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. దీన్ని ఎలా చేయాలంటే..

ప్రపంచానికి భారత దేశం ఇచ్చిన అద్భుత వరం యోగా. ఇది చాలా ఉపయోగకరమైన, ఆరోగ్యకరమైన వ్యాయామం. యోగా వ్యాయామం చేయడం వల్ల శరీరానికి, మెదడుకు, మనస్సుకు చాలా మంచిది. యోగా తో శరీరానికి కొత్త శక్తి వస్తుంది. అయితే ఒకొక్క యోగాసనం ఒకొక్క ప్రాధాన్యతను కలిగి ఉంది. దీర్ఘకాలిక వ్యాధులనుంచి ఆస్త్మా, వెన్నునొప్పి, ఇతర శ్వాస సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు. ఈరోజు శ్వాస సంబంధం వ్యాధులనుంచి నివారణ కలిగించే నాడీ శోధన ప్రాణాయామం గురించి తెలుసుకుందాం..!

Prudvi Battula
|

Updated on: Jun 12, 2023 | 12:34 PM

Share
ముందుగా పద్మాసనంలో కూర్చుని శ్వాసమీద దృష్టి పెట్టాలి. కొని నిమిషాల పాటు సాధారణ శ్వాస తీసుకోవాలి.

1 / 6
అనంతరం గయన్ ముద్ర అంటే కుడి లేదా ఎడమ చేతి చూపుడు వేలుతో బొటవేలి కులపుతూ.. మిగిలిన మూడు వేళ్ళను దూరం ఉంచి ముక్కును పట్టుకోవాలి.

2 / 6
ఒక ముక్కు రంధ్రాన్ని చేతి వేళ్ళతో మూసి.. రెండో ముక్కు రంధ్రంతో దీర్ఘ శ్వాస తీసుకోవాలి.

3 / 6
నిధానంగా శ్వాసని తీసుకుంటూ పొట్టని బిగపట్టాలి. అనంతరం శ్వాసను నియంత్రిస్తూ.. ఒక పది నెంబర్లు లెక్కపెట్టుకుని అపుడు నెమ్మదిగా శ్వాసను వదిలివేయాలి.

4 / 6
ఇలా రెండు ముక్కు రంధ్రాల నుంచి ఒకదాని తర్వాత ఒకటి గాఢంగా శ్వాస తీసుకుని.. వదలడం చేయాలి. ఇలా ఉదయమే రోజూ ఐదు నుంచి ఆరు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

5 / 6
నాడీ శోధన ప్రాణాయామం వలన ఉపయోగాలు: శరీరంలోని కండరాలకు, ఊపిరితిత్తులకు మంచి ఎనర్జీని ఇస్తుంది. శ్వాస సంబంధిత సమస్యలునివారింపడతాయి. టైడల్ వాల్యూమ్ పెరుగుతుంది. నాడీవ్యవస్థను బలంగా తయారు చేస్తుంది. మానసిక ప్రశాంతను ఇస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. శరీరంలోని అవయవాలకు ఉత్తేజాన్ని ఇస్తుంది. మెదడులోని హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతుంది.

6 / 6