Green Coriander: కొత్తిమీర కదా అని లైట్ తీసుకుంటున్నారా.. ఇది మానవ శరీర ఆరోగ్యానికి శ్రీరామరక్ష..
వంటింట్లో దొరికే ఎన్నో ఆరోగ్యకార పదార్దాలలో కొత్తమీర ఒకటి. కొత్తమీర ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. రోజు దీన్ని తింటే అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయిని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. వీటిలో ఉన్న పోషకాలు మానవాళికి ఒక వరం. వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jul 12, 2023 | 3:28 PM

షుగర్ వ్యాధిలో ఉపశమనం కలిగిస్తుంది: ప్రస్తుత కాలంలో ప్రజలను భాదపడుతున్న ఆరోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి ఒకటి. షుగర్ వ్యాధితో బాధపడేవారు కొత్తమీర తీసుకోవడం వల్ల ఈ శరీరంలో చెక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి. దింతో షుగర్ వ్యాధి నుంచి ఉపశమనం కల్గుతుంది.

అంతర్గత మంటను తగ్గిస్తుంది: శరీరంలో చాల సార్లు మంటగా అనిపిస్తుంది. అలంటి సమయాల్లో కొత్తమీరను ఉపయోగించడం వల్ల ఆ నుంచి బయటపడొచ్చు.

అధిక రక్తపోటును నియంత్రిస్తాయి: ప్రస్తుత జీవనశైలిలో చిన్న, పెద్ద తేడాలేకుండా భాదపడుతున్న సమస్య రక్తపోటు. ఈ సమస్య ఉన్నవారు ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. రోజు కొత్తమీర తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి కాస్త ఉపశమనం వస్తుంది.

అంతే కాదు మూత్ర సమస్య, చర్మ సమస్య, మూర్ఛ సమస్య, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోను కొత్తిమీర ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

పచ్చి కొత్తిమీర లిపిడ్లకు అద్భుతమైన మూలం. ఇది మూడు విధాలుగా మేలు చేసే ఔషధాలు. పచ్చి కొత్తిమీరను ఎక్కడ ఉన్న సువాసనతో సువాసన మనసును ఉత్తేజపరుస్తుంది. ఇందులో ఉండే ఎసెన్షియల్ ఆయిల్ దీనికి కారణం. ఎసెన్షియల్ ఆయిల్ అంటే మూలికలు లేదా ఔషధాల నుండి తయారుచేసిన స్వచ్ఛమైన నూనె ఇందులో ఇమిడి ఉంటుంది.

థైరాయిడ్ సమస్య ఉన్నట్లయితే పచ్చి కొత్తిమీరను మీ ఆహారాంలో చేర్చుకోండి. కొత్తిమీర థైరాయిడ్ సమస్యల కోసమే కాక మహిళల ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనది. కొత్తిమీరలో ఉండే ఔషధ గుణాలు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు థైరాయిడ్‌ను తగ్గుముఖం పెట్టించడంలో చాల సమర్థవంతంగా పనిచేస్తాయి. ఎవరికైనా థైరాయిడ్ సమస్య ఉంటే, రోజు పచ్చి కొత్తిమీరను తింటే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.




