- Telugu News Photo Gallery Health Benefits of Broccoli: Eat this one vegetable to maintain heart health and prevent cancer
Broccoli: ఆహారంలో దీనిని తీసుకుంటే.. క్యాన్సర్, గుండె జబ్బుల జీవితంలో రానేరావు!
ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో బ్రోకలీ ఒకటి. ఇది నోటికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో పోషకాలు క్యాన్సర్, గుండె జబ్బులు వంటి వాటితో పోరాడి.. జీవితంలో ఇవి రాకుండా శరీరంలో రోగనిరోధకతను పెంచుతుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అందుకే బ్రోకలీని పలు సమస్యలకు దివ్యౌషధంగా పరిగణిస్తారు..
Updated on: Feb 04, 2025 | 4:20 PM

బ్రోకలీ నోటికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా బ్రెస్ట్, గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడం వరకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇన్ని ప్రయోజనాలతో కూడిన ఈ బ్రోకోలిని క్రమం తప్పకుండా తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. బ్రోకలీ జీర్ణక్రియ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది.

బ్రోకలీలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ ఉన్నవారిలో కీళ్ల నొప్పులకు కారణమయ్యే ఎంజైమ్‌లను అడ్డుకుంటాయి. బ్రోకలీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

బ్రోకలీలో కాల్షియం, విటమిన్ K అధికంగా ఉంటాయి. ఈ రెండూ ఎముకల ఆరోగ్యానికి, బోలు ఎముకల వ్యాధి నివారణకు తోడ్పడతాయి. ఇందులో ఫైబర్స్, కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు శరీరంలో రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. రక్త నాళాలు దెబ్బతినకుండా రక్షించడంలో కూడా సహాయపడుతుంది.

బ్రోకలీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. అతిగా తినడాన్ని కూడా నివారిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు, ఆహారంలో దీనిని చేర్చుకోవడం మంచిది. ఇది శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. బ్రోకలీలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి పోషకాలతో పాటు జింక్ వంటి ఖనిజాలను శరీరానికి అందిస్తాయి. ఇది చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది. ముఖంపై ముడతలు, మొటిమలు, పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.





























