Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curry Leaves: వంటలకు రుచే కాదు.. కరివేపాకు నీళ్లు తాగితే ఈ ఆరోగ్య సమస్యలూ పరార్‌!

దక్షిణాది వంటల్లో కరివేపాకు తప్పనిసరి. వంటలో కరివేపాకులను కలుపుకుంటే అద్భుతమైన రుచి కూడా. పైగా వండినప్పుడు మంచి సువాసన వస్తుంది. కానీ వంట రుచిని పెంచడానికి, మంచి వాసన తీసుకురావడానికి మాత్రమే కాదు, ఈ కరివేపాకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి వివిధ పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి..

Srilakshmi C
|

Updated on: Sep 04, 2024 | 8:49 PM

Share
దక్షిణాది వంటల్లో కరివేపాకు తప్పనిసరి. వంటలో కరివేపాకులను కలుపుకుంటే అద్భుతమైన రుచి కూడా. పైగా వండినప్పుడు మంచి సువాసన వస్తుంది. కానీ వంట రుచిని పెంచడానికి, మంచి వాసన తీసుకురావడానికి మాత్రమే కాదు, ఈ కరివేపాకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి వివిధ పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి.

1 / 5
ఈ కరివేపాకు శరీరంలోని వివిధ వ్యాధులకు అంటే కడుపు నొప్పి, జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఒంట్లో కొవ్వును తొలగిస్తుంది. వంటకే కాదు, నీళ్లలో కలిపి డిటాక్స్ డ్రింక్ కూడా తయారు చేసుకోవచ్చు. కరివేపాకును రోజూ తింటే ఎన్ని లాభాలో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. కరివేపాకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో 'చెడు' కొలెస్ట్రాల్,  ట్రైగ్లిజరైడ్‌ల స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. కరివేపాకులో నానబెట్టిన నీరు శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను సహజ పద్ధతిలో తొలగించడానికి సహాయపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన ఈ విషపదార్థాలను తొలగించగలిగితే పొట్ట, చర్మం, జుట్టు మొదలుకుని అన్ని సమస్యలూ నయమవుతాయి. అధిక శరీర బరువు కూడా తగ్గుతుంది.

3 / 5
జీర్ణ రుగ్మతలతో బాధపడేవారు క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. అయితే కరివేపాకు నానబెట్టిన నీళ్లను తాగితే మాత్రం రకరకాల కడుపు సమస్యలతో పాటు మలబద్ధకం కూడా నయం చేయడంలో సహాయపడుతుంది.

4 / 5
కరిపాటాలో కార్బజోల్, ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇది శరీరం నుంచి అదనపు కొవ్వును తొలగించడానికి పనిచేస్తుంది. వ్యాయామంతో పాటు, కరివేపాకులను క్రమం తప్పకుండా ఉదయం ఖాళీ కడుపుతో లేదా వంటలో తినడం వల్ల కొవ్వు వేగంగా తగ్గుతుంది.

5 / 5