Health Tips: కాకరకాయ.. మితంగా తింటే ఔషధం.. అమితంగా తింటే విషం.. ఎందుకంటే..

కాకరకాయ.. దీని పేరు వినగానే గుర్తొచ్చేది చేదు...ఎంత చేదు కూరగాయ అయినా కాకరకాయ కు మంచి డిమాండ్ ఉంది..షుగర్ వ్యాధి గ్రస్తులు కాకరకాయను ఎక్కువగా తింటుంటారు. షుగర్ అనేది ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద వ్యాధి గా మారింది.  వయసుతో పని లేకుండా చిన్నా, పెద్ద, ముసలి ,మూతిక అందరిని అటాక్ చేస్తుంది.

Sridhar Prasad

| Edited By: Rajeev Rayala

Updated on: Nov 09, 2023 | 6:30 PM

కాకరకాయ.. దీని పేరు వినగానే గుర్తొచ్చేది చేదు...ఎంత చేదు కూరగాయ అయినా కాకరకాయ కు మంచి డిమాండ్ ఉంది..షుగర్ వ్యాధి గ్రస్తులు కాకరకాయను ఎక్కువగా తింటుంటారు. షుగర్ అనేది ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద వ్యాధి గా మారింది.  వయసుతో పని లేకుండా చిన్నా, పెద్ద, ముసలి ,మూతిక అందరిని అటాక్ చేస్తుంది.

కాకరకాయ.. దీని పేరు వినగానే గుర్తొచ్చేది చేదు...ఎంత చేదు కూరగాయ అయినా కాకరకాయ కు మంచి డిమాండ్ ఉంది..షుగర్ వ్యాధి గ్రస్తులు కాకరకాయను ఎక్కువగా తింటుంటారు. షుగర్ అనేది ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద వ్యాధి గా మారింది.  వయసుతో పని లేకుండా చిన్నా, పెద్ద, ముసలి ,మూతిక అందరిని అటాక్ చేస్తుంది.

1 / 5
షుగర్ తో బాధపడ్తున్నవారు దాన్ని కంట్రోల్ లో పెట్టుకోడానికి చేదు పదార్దాలు ఎక్కువగా తింటుంటారు. మెంతులు,మెంతి కూరతో పాటు కాకరకాయను కూడా ఎక్కువగా వినియోగిస్తారు.. కాకరకాయను కూర రూపంలోనే కాకుండా కాకరకాయను రసం చేసుకొని తాగితే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది అంటారు.

2 / 5
కాకరకాయ డయాబెటిస్ కంట్రోల్ కు మంచి పదార్థమే అయినా ఇంతకు దాన్ని ఎంత మేరకు తినాలి.? ఎలా తినాలి.? అన్నది కూడా చాల ముఖ్యం అంటున్నారు వైద్యులు...తింటే మేలు ఏంటి.? అతిగా తింటే నష్టం ఏంటి.? కాకరకాయ చేదుగా ఉంటుంది కానీ ఇందులో పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. షుగర్ నే కాదు కాకరకాయ బరువును కూడా కంట్రోల్ తగ్గిస్తుంది.

3 / 5
బాడీలో కొవ్వును తగ్గించడంలో కాకరకాయ బాగా పనిచేస్తుంది. గుండెకు కూడా కాకరకాయ మేలు చేస్తుంది. కొవ్వును కరిగించడంలో కాకర బాగా పనిచేస్తుంది. షుగర్ లెవల్స్ ని కాకర కంట్రోల్ చేస్తుంది. అయితే షుగర్ లెవల్స్ తక్కువ ఉన్నవాళ్ళు మాత్రం కాకరకాయను తినకూడదు. గర్భధారణ సమయంలో పిండానికి మంచిది కాదు అని వైద్యుల మాట. కాబట్టి ఆ సమయంలో కాకరకాయ తినకపోవడం మంచిది.

4 / 5
షుగర్ ను దృష్టిలో పెట్టుకొని ప్రతి రోజు కాకరకాయ తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదంటా.. అలా తింటే లివర్ కి ప్రమాదం అంటున్నారు వైద్యులు దీనితో పాటు డయేరియా సమస్యలు కూడా రావొచ్చు అంటా రోజు తినే బదులు వారానికి రెండు మూడు సార్లు తింటే చాలు అంటున్నారు నిపుణులు...అతి చేదు కూడా ఆరోగ్యానికి హాని అంటున్నారు వైద్యులు. 

5 / 5
Follow us