- Telugu News Photo Gallery Goa’s Mopa International Airport to be inaugurated on December 11, here’s the first look pics
PM Modi: గోవా మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. ఫొటోలు అదుర్స్..
దేశంలో కనెక్టివిటీని పెంపొందించడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశవ్యాప్తంగా రోడ్డు రవాణా మార్గం, విమానాశ్రయాల అభివృద్ధితో ప్రభుత్వ విధానాలను ప్రతిబింబిస్తుంది.
Updated on: Dec 10, 2022 | 3:04 PM

దేశంలో కనెక్టివిటీని పెంపొందించడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశవ్యాప్తంగా రోడ్డు రవాణా మార్గం, విమానాశ్రయాల అభివృద్ధితో ప్రభుత్వ విధానాలను ప్రతిబింబిస్తుంది.

ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 11న గోవా, మహారాష్ట్రలలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా నాగ్‌పూర్- షిర్డీ మధ్య 520 కి.మీల దూరాన్ని కవర్ చేసే సమృద్ధి మహామార్గ్ మొదటి దశ ఎక్స్‌ప్రే వే నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

దీంతోపాటు గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ విమానాశ్రయాన్ని అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు.

మోపా విమానాశ్రయాన్ని 2,312 ఎకరాల్లో రూ.2,870 కోట్లతో నిర్మించారు. తొలిదశలో ఏడాదికి 44 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉంది

ఉత్తర గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు జనవరి 5, 2023 నుంచి ప్రారంభం కానున్నాయి. మోపా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని మోఈ 2016 నవంబర్‌లో ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.

ఇది గోవాలో రెండవ విమానాశ్రయం.. దబోలిమ్‌లో మొదటిది. మోపా విమానాశ్రయం డబోలిమ్ విమానాశ్రయం కంటే అనేక అత్యాధునిక సదుపాయాలతో రూపొందించారు.

ప్రధాని మోడీ దూరదృష్టితో ఎనిమిదేళ్లలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయింది. 2014 నుంచి దేశంలోని ఆపరేషనల్ ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్య దాదాపు 74 నుండి 140కి రెండింతలు పెరిగింది. రాబోయే 5 సంవత్సరాలలో 220 విమానాశ్రయాలను అభివృద్ధి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.




