Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghee for Skin: శీతాకాలంలో నెయ్యితో అందానికి మెరుగులద్దుదాం.. ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి

వేడి వేడి అన్నంలో ఒక చెంచా నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. చలికాలంలో కూడా నెయ్యి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఈ సీజన్‌లో చర్మానికి నెయ్యి అప్లై చేయడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు పొందొచ్చు. నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. వారానికి ఒకసారి నెయ్యి ఫేస్ ప్యాక్ ఉపయోగించవచ్చు. శెనగపిండి, పసుపులో నెయ్యి కలిపి చర్మానికి 20 నిమిషాలు పట్టిస్తే ప్రకాశవంతంగా మారుతుంది..

Srilakshmi C

|

Updated on: Dec 14, 2023 | 8:39 PM

వేడి వేడి అన్నంలో ఒక చెంచా నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. చలికాలంలో కూడా నెయ్యి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఈ సీజన్‌లో చర్మానికి నెయ్యి అప్లై చేయడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు పొందొచ్చు. నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. వారానికి ఒకసారి నెయ్యి ఫేస్ ప్యాక్ ఉపయోగించవచ్చు. శెనగపిండి, పసుపులో నెయ్యి కలిపి చర్మానికి 20 నిమిషాలు పట్టిస్తే ప్రకాశవంతంగా మారుతుంది.

1 / 5
నెయ్యిని హ్యాండ్ క్రీమ్‌గా ఉపయోగించవచ్చు. కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో నెయ్యి మిక్స్ చేసి రెండు చేతులకు అప్లై చేయాలి. ఇది చేతుల చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. నెయ్యిని చేతులతో పాటు ముఖానికి మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. తక్కువ మంట మీద నెయ్యి వేడి చేసి, ఆ తర్వాత అందులో అలోవెరా జెల్‌ను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచి తడి టవల్‌తో ముఖాన్ని తుడుచుకోవాలి. ఈ చిట్కా పొడి చర్మానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది.

2 / 5
పెదాలను ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి నెయ్యిని ఉపయోగించవచ్చు. నెయ్యి, తేనె, పంచదార సమాన పరిమాణంలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులపై అప్లై చేసి వృత్తాకారంలో మసాజ్ చేయాలి. ఈ లిప్ స్క్రబ్ పెదవులపై ఉన్న మృతకణాలన్నిటినీ తొలగించి, పెదవుల గులాబీ రంగును తిరిగి తెస్తుంది.

3 / 5
నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు మినరల్స్ ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. నెయ్యి, తేనె కలిపి చర్మంపై వృత్తాకారంలో మసాజ్ చేసుకోవాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై వృద్ధాప్య సంకేతాలను దూరం చేసుకోవచ్చు.

4 / 5
 చలికాలంలో తప్పనిసరిగా బాడీ లోషన్ వాడాలి. షియా బటర్ లేదా కోకో బటర్‌తో నెయ్యి కలుపుకుని చేతులు, కాళ్ళ ఉపయోగించవచ్చు. అలాగే చలికాలంలో మడమల పగుళ్లు చాలా సాధారణం. అయితే రోజూ నిద్రపోయే ముందు మడమలకు నెయ్యి రాసుకుంటే పాదాల పగుళ్ల సమస్యను సులభంగా నివారించుకోవచ్చు.

5 / 5
Follow us