- Telugu News Photo Gallery Geyser Maintenance for Winter: do not forget these important things while using geysers in winter season
Geyser usage in winter: చలికాలంలో గీజర్ వాడుతున్నారా? ఈ తప్పులు చేశారో ప్రాణాలకే ముప్పు
చలికాలంలో చాలా ఇళ్లల్లో స్నానానికి నీళ్లు వేడి చేసుకోవడానికి గీజర్లు ఉపయోగిస్తుంటారు. అయితే కొంత మంది అవగాహన లేకపోవడం వల్ల కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. తప్పులు చిన్నవే అయినప్పటికీ ఫలితాలు మాత్రం ఊహించని విధంగా ఉంటాయి. అందువల్ల ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు..
Updated on: Nov 20, 2024 | 9:27 PM

రోజురోజుకీ చలి ముదురుతుంది. నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక మునుముందు మరింత తీవ్రం అవుతుంది. పొద్దున లేచిన వెంటనే స్నానం చేసే అలవాటున్న వారికి చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం చాలా కష్టమైన పని. అందుకే నీటిని వేడి చేయడానికి చాలా మంది గీజర్లను ఉపయోగిస్తుంటారు. అయితే గీజర్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని సార్లు గీజర్ల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. అందుకే గీజర్‌ను ఉపయోగించేటప్పుడు తగిన శ్రద్ధ వహించాలి. గీజర్‌ను ఆన్ చేసినప్పుడు, నీరు నిమిషాల వ్యవధిలో వేడెక్కుతుంది. దీని వల్ల సులభంగా స్నానం చేయవచ్చు. కానీ చాలా సార్లు దీన్ని ఆన్ చేసినప్పటికీ ఎక్కువసేపు ఆఫ్ చేయరు. ఇలా గీజర్ ఎక్కువ సమయం ఆన్‌లో ఉండటం అంత మంచిదికాదు.

ఇలాంటి సందర్భంలో గీజర్ పేలడం సంభవిస్తుంది. అందుకే మీరు గీజర్‌ని ఉపయోగించినప్పుడు, ఎక్కువసేపు ఆన్ చేయకుండా చూసుకోవాలి. నీరు వేడెక్కిన వెంటనే గీజర్‌ను ఆఫ్ చేయడం చాలా అవసరం. సాధారణంగా డబ్బు ఆదా చేసేందుకు తక్కువ ధరకే గీజర్లను కొంటుంటారు.

ఇదే తరువాత వారికి చాలా సమస్యలను సృష్టిస్తుంది. ఎందుకంటే, స్థానిక కంపెనీలు గీజర్లలో భద్రతా ప్రమాణాలు ఉండవు. అలాంటి గీజర్లు పాడైపోయే అవకాశాలు ఎక్కువ. వాటిలో ప్రమాదాల భయం కూడా ఎక్కువే. అందుకే గీజర్‌ను కొనుగోలు చేసేటప్పుడు బ్రాండెడ్ కంపెనీ నుంచి మాత్రమే గీజర్‌ను కొనుగోలు చేయడం మంచిది.

బాత్రూంలో సరైన స్థలంలో గీజర్ను ఇన్స్టాల్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా వరకు గీజర్ ప్రమాదాలు గీజర్ మీద పడటం వల్లనే జరుగుతుంటాయి. అందుకే బాత్రూమ్ పైభాగంలో నీరు చేరని చోట గీజర్ అమర్చాలి.




