- Telugu News Photo Gallery Get rid of all these skin problems with glycerin, check here is details in Telugu
Glycerin for Skin: గ్లిజరిన్‌తో ఈ చర్మ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు..
శీతాకాలంలో అనారోగ్య సమస్యలే కాకుండా.. చాలా మంది చర్మ సంబంధిత సమస్యల్ని కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. శీతా కాలంలో చాలా మంది స్కిన్ పొడి బారిపోయి, నిర్జీవంగా, ముడతలతో కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే.. మాయిశ్చరైజర్స్ ఉపయోగిస్తూ ఉండాలి. చర్మ సంరక్షణలో గ్లిజరిన్ కూడా ముఖ్య పాత్ర వహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గ్లిజరిన్ ఉపయోగం వల్ల చర్మం ఆరోగ్యం మెరుగు పడి, స్కిన్ టోన్ మెరుగు పరచడంలో కూడా..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Jan 15, 2024 | 7:00 PM

శీతాకాలంలో అనారోగ్య సమస్యలే కాకుండా.. చాలా మంది చర్మ సంబంధిత సమస్యల్ని కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. శీతా కాలంలో చాలా మంది స్కిన్ పొడి బారిపోయి, నిర్జీవంగా, ముడతలతో కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే.. మాయిశ్చరైజర్స్ ఉపయోగిస్తూ ఉండాలి. చర్మ సంరక్షణలో గ్లిజరిన్ కూడా ముఖ్య పాత్ర వహిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గ్లిజరిన్ ఉపయోగం వల్ల చర్మం ఆరోగ్యం మెరుగు పడి, స్కిన్ టోన్ మెరుగు పరచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా చర్మం పొడి బారడాన్ని తగ్గించి హైడ్రేట్ చేస్తుంది. గ్లిజరిన్‌ని నేరుగా చర్మంపై కూడా ఉపయోగించవచ్చు.

శీతాకాలంలో గ్లిజరిన్‌ని క్రమం తప్పకుండా వాడితే చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. గ్లిజరిన్ మందంగా ఉంటుంది కాబట్టి.. దీన్ని డైల్యూట్ చేసి ఉపయోగించాలి. రోజ్ వాటర్‌తో కలిపి గ్లిజరిన్ ని ఉపయోగించవచ్చు.

చేతి వేళ్లు లేదా కాట్ పాడ్ సహాయంతో మీకు స్కిన్ పగిలే ప్రదేశాల్లో, పొడిగా ఉండే ప్రదేశాల్లో అప్లై చేసి.. సున్నితంగా చేతి వేళ్లతో సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల స్కిన్.. సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఇలా శీతా కాలంలో చేస్తే వృద్ధాప్య ఛాయలు, మొటిమలు, డల్ స్కిన్, చర్మం పగలడం వంటివి దూరమవుతాయి.

స్కిన్ హైడ్రేట్ అయి.. కాంతి వంతంగా తయారవుతుంది. కేవలం శీతా కాలంలోనే కాదు.. ఏ సీజన్‌లోనైనా గ్లిజరిన్‌ని ఉపయోగించవచ్చు. అయితే గ్లిజరిన్ అనేది అందరికీ పడదు. ఇది వాడే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.





























