గుండెను కాపాడుతున్న వెల్లుల్లి.. అది ఎలా అనుకుంటున్నారా?
వెల్లుల్లి లేనిది వంటిల్లే ఉండదు. చాలా వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో వెల్లుల్లి ఉంటుంది. ఇంది వంట్లో వేయడం వలన ఆహారపదార్థాలకు మంచి రుచిని ఇవ్వడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరీ ముఖ్యంగా వెల్లుల్లి ఎక్కవగా తినడం వలన ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందంట. కాగా, వెల్లుల్లి ఆహారంలో చేర్చుకోవడ వలన గుండెకు కలిగే మేలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jul 02, 2025 | 8:36 PM

రోజూ రాత్రి రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తింటే రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుందని చెబుతున్నారు. చర్మ సమస్యలు, వెంట్రుకలు రాలడం వంటి సమస్యలు కూడా దూరమౌతాయని అంటున్నారు.

వానా కాలంలో చాలా మంది అనేక సీజనల్ రోగాల బారిన పడుతుంటారు. వెల్లుల్లిలో అనేక రోగాలకు చెక్ పెట్టే గుణాలు సమృద్ధిగా నిండి ఉంటాయి. రోజూ రాత్రిపూట రెండు వెల్లుల్లీ రెబ్బల్ని తింటే జీవక్రియలు సమర్థవంతంగా జరుగుతాయి. డైలీ వెల్లుల్లి రెబ్బల్ని తింటే.. మలబద్దకం వంటి సమస్యలు ఉండదు.

వెల్లుల్లి ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపరుస్తుంది. రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఎందుకంటే, ఇందులో అల్లిసిన్, విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. మీ శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. జలుబు, ఫ్లూ, సైనస్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.

వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. రక్తపోటును కూడా నిర్వహిస్తుంది. హైపర్‌టెన్షన్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. వెల్లుల్లిలో డిటాక్సిఫికేషన్ చేసే గుణం ఉంటుంది. ఇది మన శరీరంలో విషపదార్థాలు బయటకు పంపుతుంది. అంతేకాదు ఇది కాలేయ ఆరోగ్య పరిస్థితిని కూడా మెరుగు చేస్తుంది.

పడుకునే ముందు వెల్లుల్లి తినడం వల్ల కాలేయ ఎంజైమ్‌లు సక్రియం అవుతాయి. వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. వెల్లుల్లిలో డయాలిల్ డైసల్ఫైడ్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు కీళ్ల, కండరాల నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. వెల్లుల్లి ఆర్థరైటిస్ సమస్యకు ఉపశమనం కలిగిస్తుంది.



