Garlic in Winter: చలికాలంలో వెల్లుల్లి ఇలా తీసుకుంటే.. రోగాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు

చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడం నుంచి రోగాల భారీ నుంచి కాపాడటం వరకు వెల్లుల్లి బలేగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లి శరీరంలో వెట్ట పుట్టిస్తుంది. దీంతో చలి నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ కాలంలో వెల్లుల్లిని ఏ సమయంలో తీసుకోవాలో చాలా మందికి క్లారిటీ ఉండదు..

Srilakshmi C

|

Updated on: Dec 16, 2024 | 9:19 PM

వెల్లుల్లిని వంటలో ఉపయోగించినప్పుడు ఆహారం రుచి రెట్టింపవుతుంది. దీనిని శరీరంలోకి తీసుకుంటే ఎముకల నిర్మాణంలో సహాయపడుతుంది. US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం వెల్లుల్లి గాత్రాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.

1 / 5
చలికాలంలో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల జలుబు, ఫ్లూ 63 శాతం తగ్గుతాయని ఓ నివేదిక వెల్లడించింది. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అలాగే వెల్లుల్లిలో మెగ్నీషియం, కాల్షియం, జింక్, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి.

2 / 5
వెల్లుల్లిలోని అల్లిసిన్ రక్త ప్రసరణను పెంచడంలో కూడా సహాయపడుతుంది. అయితే ఆయుర్వేదం ప్రకారం, యూరిక్ యాసిడ్, కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

3 / 5
అలాగే రాత్రి పడుకునే ముందు రెండు వెల్లుల్లి రెబ్బలను నీళ్లలో నానబెట్టాలి. వీటిని ఉదయాన్నే తినాలి. అయితే ఒక్కటి గుర్తుంచుకోండి. మీకు ఏదైనా అలెర్జీ సమస్య ఉంటే లేదా మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులకు మందులు తీసుకుంటుంటే మాత్రం, వెల్లుల్లి తినే ముందు వైద్యుడిని సంప్రదించాలి.

4 / 5
అంతేకాకుండా, వెల్లుల్లిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శ్వాసకోశ, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి శీతాకాలంలో జ్వరం, గొంతు నొప్పికి ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే, బరువు తగ్గడానికి వెల్లుల్లిని తీసుకోవచ్చు. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది జీవక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఉదయం పూట పచ్చి వెల్లుల్లిని తేనెతో కలిపి తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
Follow us