- Telugu News Photo Gallery Gajakesari Raja Yoga brings good luck to those born under the four zodiac signs
గజకేసరి రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
గ్రహాల కలయిక వలన రాజయోగాలు ఏర్పడుతాయి. అయితే ఈ సారి చాలా రోజుల తర్వాత శ్రావణ మాసంలో గజకేసరి రాజయోగం ఏర్పడ నుంది. దీంతో నాలుగు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టనుంది. కాగా, ఇంతకీ ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Updated on: Jul 19, 2025 | 10:45 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక, సంచారం వలన రాజయోగాలు ఏర్పడుతాయి. అయితే మిథున రాశిలోకి బృహస్పతి సంచారం చేయనుంది. ఇప్పటికే ఆ రాశిలో చంద్రగ్రహం కూడా ఉండటం వలన ఈ రెండు గ్రహాల కలయిక వలన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ శక్తివంతమైన రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చి పెట్టబోతోంది. దీనివల్ల ఆకస్మిక సంపదతో పాటు ఆనందం కూడా లభిస్తుంది.

తుల మకర రాశి : తుల రాశి వారికి వ్యాపారం బాగుంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు జాబ్ కొడుతారు. బంగారం, వెండి లేదా రియలెస్టేట్ రంగంలో పని చేసే వారు అత్యధిక ఆర్థిక లాభాలు పొందుతారు. ఆర్థికంగా బాగుంటుంది. అన్నింటా కలిసి వస్తుంది.

వృశ్చిక రాశి : ఈ రాశి వారు గజకేసరి రాజయోగం వలన అత్యధిక లాభాలు పొందుతారు. అంతే కాకుండా అమ్మకాలు పెరుగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మీరు ఎందులో పెట్టుబడి పెట్టినా మీకు మంచి రాబడి రావడం ఖాయం. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్థులు పదోన్నతి పొందుతారు.

కన్యా రాశి : అలాగే కన్యా రాశి వారికి సంపద రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది. కొత్త వరనరుల నుంచి డబ్బు సంపాదిస్తారు. వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది.

వృషభ రాశి : ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం వలన కలిసి వస్తుంది. ఆస్తులు పెరుగుతాయి. ఉద్యోగం చేసేవారు మీ పై ఉన్నవారి నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.



