శరీరంలో పలు రకాల వ్యాధుల గురించి తెలుసుకోవడానికి తరచుగా యూరిన్ టెస్ట్ చేసుకోవడం అవసరం. ముఖ్యంగా కిడ్నీ వ్యాధికి అయితే ఈ పరీక్ష చాలా ముఖ్యం. మూత్రం రంగు మాత్రమే కాదు, రోజుకు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తున్నారో అనే విషయం కూడా చాలా ముఖ్యం. మూత్ర విసర్జన చేయకపోవడం మంచిది కాదు. అలాగనీ తరచుగా మూత్రవిసర్జన చేయడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు.