Health Tips: పాలు, పాల ఉత్పత్తులతో కలిపి తీసుకోకూడని ఆహారాలు.. ఒకేసారి తింటే ఆరోగ్యానికి నష్టమే..
Health Tips: ఆరోగ్య సంరక్షణలో పాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను పాలు, పాల ఉత్పత్తుల ద్వారా పొందవచ్చు. ఈ కారణంగానే చిన్న పిల్లల ఆహారంలో పాలు లేదా పాల ఉత్పత్తులు తప్పక ఉండాలని నిపుణులు చెబుతుంటారు. పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి పిల్లలకే కాదు పెద్దల ఆరోగ్యానికి కూడా అవసరమే. అయితే పాలు, పాల ఉత్పత్తులను తీసుకునే విషయంలో కొన్ని తప్పులు చేయకూడదు. అవేమిటంటే..?
Updated on: Oct 03, 2023 | 7:56 AM

Health Tips: పాలు, పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి ప్రయోజనకరమే అయినప్పటికీ కొన్ని రకాల పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. ఇలా కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలతో పాటు వికారం, వాంతులు, తలనొప్పి, అలెర్జీ వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి.

పెరుగు, పండ్లు: చాలా మంది పెరుగుతో పండ్లను కలిపి తీసుకుంటారు. కానీ పుల్లని పండ్లను పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, అలెర్జీలు కలుగుతాయి.

పాలు, అరటి: చాలా మంది పాలు, ఆరటిపండ్లను కలిపి మిల్క్ షేక్ చేసి తాగుతుంటారు. కానీ అది మంచిది కాదు. వీటిల్లో క్యేలరీలు ఎక్కువగా ఉన్నందున మీరు త్వరగా బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో బరువు తగ్గాలనుకునేవారు పాలు, అరటి పండ్లను కలిపి తీసుకోకూడదు.

పెరుగు, ముల్లంగి: ముల్లంగి, పెరుగు ఆరోగ్యానికి మంచివే కానీ రెండింటినీ కలిపి తీసుకోవడం మంచిది కాదు. ముల్లంగి కూరతో భోజనం లేదా ముల్లంగి జ్యూస్ తీసుకున్న తర్వాత పెరుగు తింటే జీర్ణ సమస్యలు కలుగుతాయి.

చేప, పాలు: చేపలు తిన్న వెంటనే పాలు తాగితే కడుపుకు హాని కలుగుతుంది. రెండింటిలోనూ ప్రొటీన్ ఎక్కువగా ఉన్నా.. వీటి స్వభావం విభిన్నం. ఫలితంగా కడుపు నొప్పి కలిగే అవకాశం ఉంది.





























