Food For Health: చేపలు లేదా చికెన్.. ఏది ఆరోగ్యానికి మంచిది.. రెండూ కలిపి తింటున్నారా.. మీకోసం
నాన్ వెజ్ ప్రియులకు కొందరు చికెన్ ను ఎక్కువగా తింటే.. మరికొందరు సీఫుడ్ ను అందులోనూ చేపలను ఎక్కువమంది ఇష్టంగా తింటారు. కొందరు బిర్యానీ, పులవు వంటి ఆహారంతో పాటు చేపలను తినడానికి ఆసక్తిని చూపిస్తారు. కొందరు రెగ్యులర్ గా నాన్ వెజ్ ను తింటారు. అయితే చికెన్ లేదా చేపలు ఏది తింటే ఆరోగ్యానికి మంచిది.. అసలు రెండు కలిపి తినవచ్చా తెలుసుకుందాం..
Updated on: Aug 26, 2023 | 1:03 PM

వాస్తవానికి నేటి తరంలో మాంసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.. అదే సమయంలో చేపలు తినడానికి ఇష్టపడరు. దీంతో ఇంట్లో ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. చేపలు తినకపోవడం వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుందని చాలామంది తల్లిదండ్రులు నమ్ముతారు.

ప్రొటీన్లు మన శరీరానికి 'బిల్డింగ్ బ్లాక్స్'. ఈ పోషకాల సహాయంతో కణాలు నిర్మించబడతాయి. అలాగే కండరాలను నిర్మించడం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఈ ప్రోటీన్లు తమ పనులను సక్రమంగా ఒంటరిగా నిర్వహిస్తుంది.

ప్రోటీన్లలో అమైనో ఆమ్లాలు ఉంటాయి. మన శరీర నిర్మాణానికి ఇది చాలా అవసరం. చేపలు, మాంసంలో తగినంత ప్రోటీన్లు ఉంటాయి. అయితే సముద్రపు చేపలల్లో ఈ ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది

100 గ్రాముల సముద్ర చేపల నుంచి 42 గ్రాముల ప్రొటీన్ లభిస్తుండగా.. 100 గ్రాముల మాంసం నుంచి 24 గ్రాముల ప్రొటీన్ మాత్రమే లభ్యమవుతోంది. అయితే మనం రోజూ తినే మంచినీటి చేపల్లో ప్రొటీన్లు చాలా తక్కువ.

అయితే చేపలు, మాంసాహారం కలిపి తింటే పెద్ద మొత్తంలో ప్రొటీన్ లభించదు. బదులుగా ఇది శరీరంలో ప్రోటీన్ లోపాన్ని కలిగిస్తుంది. అలాగే జీర్ణక్రియ కూడా సక్రమంగా జరగదు. కనుక ఆరోగ్యంగా ఉండాలనుకుంటే.. చేపలు, మాసం కలిపి తినవద్దు.

చేపలు, మాంసం ఎక్కువగా తినడం అనారోగ్యానికి హానికరం. కాబట్టి మితంగా తినండి. ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా శరీరంలో ఉండడం కూడా అనారోగ్యానికి హానికరమే అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బరువు 50 కిలోలు ఉంటే రోజువారీ ప్రోటీన్ అవసరం 40 గ్రాములు. ఈ విధంగా లెక్కించాలి ఎక్కువ నూనె, మసాలాలతో వంట చేయకూడదు.




