- Telugu News Photo Gallery Fiber Rich Food: These Fiber Rich Foods that can help you poop and relieve constipation
Fiber Rich Food: మలబద్దకంతో బాధపడేవారు ఈ ఆహారాన్ని తిన్నారంటే..
ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్‌తో పాటు ఫైబర్ కూడా అవసరం. మంచి జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డైటరీ ఫైబర్ చాలా ముఖ్యం. ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనానికి సహాయపడుతుంది. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గుతుంది. ఫైబర్ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఏయే ఆహారాల్లో ఫైబర్ అధికంగా ఉంటుందంటే..
Updated on: Oct 17, 2023 | 7:31 PM

ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్‌తో పాటు ఫైబర్ కూడా అవసరం. మంచి జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డైటరీ ఫైబర్ చాలా ముఖ్యం. ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనానికి సహాయపడుతుంది.

పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గుతుంది. ఫైబర్ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఏయే ఆహారాల్లో ఫైబర్ అధికంగా ఉంటుందంటే..

బీటా-గ్లూకాన్ అని పిలిచే పీచుపదార్థం ఓట్స్‌లో పుష్కలంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో బీటా-గ్లూకాన్ సహాయపడుతుంది. అలాగే జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంచి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే రోజువారీ ఆహారంలో పప్పులను కూడా తీసుకోవాలి. పప్పులో ఫైబర్, ప్రోటీన్, ఇతర పోషకాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒక గిన్నె పప్పు తినడం వల్ల శరీరంలో పోషకాహార లోపం నివారించవచ్చు.

ఆపిల్, నారింజ, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్ వంటి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. యాపిల్స్‌లో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఈ పండ్లన్నీ పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. బత్తాయి, క్యారెట్ వంటి వాటిల్లో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది.

అవిసె గింజలలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా ఈ గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మలబద్ధకంతో బాధపడువారు వీటిని తినవచ్చు. వీటిల్లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది.




