- Telugu News Photo Gallery Feng Shui Tips: Which finger should you wear which ring on to increase wealth?
ఫెంగ్ షుయ్ చిట్కాలు: ఏ వేలుకు ఏ ఉంగరం ధరిస్తే సంపద పెరుగుతుందో తెలుసా?
చేతికి ఉంగరం ఉండటం చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే కొంత మంది ఉంగరం వేలుకి ఉంగరం ధరిస్తే మరికొంత మంది, చూపుడు వేలుకు, మధ్య వేలుకు ఉంగరం ధరిస్తారు. ఇక కొంత మందికైతే ఎడమచేయి, కుడి చేయి, ఏ వేళ్లకు ఉంగరం ధరించడం మంచిదనేది తెలుసుకోరు. కాగా, ఇప్పుడు మనం ఫెంగ్ షుయ్ చిట్కాల ప్రకారం, ఏ వేలుకు ఉంగరం ధరిస్తే సంపద పెరుగుతుందో చూద్దాం.
Updated on: Sep 28, 2025 | 12:30 PM

ఈయన ప్రకారం ఉంగరం ధరించడానికి ఒక్కో వేలుకు ఒక్కో ప్రత్యేక ప్రాధన్యత ఉంటుందంట. కుడి వేలుకు ఉంగరం ధరించడం చాలా మంచిదంట. దీని వలన మీకు కావాల్సిన శక్తి లభించడమే కాకుండా, ఇంట్లో సంపద, శ్రేయస్సు కలుగుతుందంట. అలాగే ఉంగరం వేలుకు ఉంగరం ధరించడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలే ఉండవంట.

కుడి చేయి ఉంగర వేలుకు రింగ్ ధరించడం అత్యంత శుభప్రదం అంటున్నారు పండితులు. ఎందుకంటే? ఈ వేలు శక్తి, ప్రతిష్ట, శ్రేయస్సును సూచించే సూర్యుడితో ముడిపడి ఉంటుందంట. అందువలన కుడి చేయి ఉంగరపు వేలుకు రింగ్ ధరించడం వలన వ్యాపారంలో పురోగతి, కెరీర్ బాగుండటం వంటివి జరుగుతాయని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

అదే విధంగా ఎడమ చేయి ఉంగర వేలుకు ఉంగరం ధరించడం కూడా మంచిదంట. కానీ దీని ప్రభావం కుడి చేయిదానికంటే కొంత భిన్నంగా ఉంటుందంట. ఎడమ చేయి ఉంగరపు వేలుకు రింగ్ ధరించడం వలన ఇది ప్రేమ, అందం, సామాజిక శ్రేయస్సును సూచించే శుక్రగ్రహంతో ముడిపడి ఉంటుంది. దీని వలన మానసిక ప్రశాంతత, జీవితంలో ఆనందం వంటివి కలుగుతాయంట.

ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలిగిపోయి సంపద పెరగాలంటే, ఏ చేయికి ధరించడమో అనే విషయమే కాకుండా ఉంగరం విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలంట. రత్నం, లోహం ఎంచుకోవడం చాలా మంచిదంట. ఇవి సానుకూల శక్తిని ప్రభావితం చేస్తాయంట.

చాలా మంది ఎక్కువగా బంగారు ఉంగరం ధరిస్తుంటారు. అయితే బంగారం అనేది సూర్యుడికి సంబంధించినది కాబట్టి దీనిని ధరించడం కూడా శుభప్రదం, బంగారు ఉంగరం ధరించడం వలన సూర్యుడి శక్తి, సంపద లభిస్తుందంట. (నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)



