- Telugu News Photo Gallery Fastrack launch its first bluetooth calling feature smart phone Fastrack Reflex Play+ Telugu Tech News
Fastrack Reflex Play+: ఫాస్ట్రాక్ యూజర్లకు గుడ్‌న్యూస్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో తొలి స్మార్ట్ వాచ్ వచ్చేసింది..
Fastrack Reflex Play+: వాచ్‌ల తయారీకి పెట్టింది పేరైన ప్రముఖ కంపెనీ ఫాస్ట్రాక్ తాజాగా మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ ప్లే + పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉండడం విశేషం. వాచ్ ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Aug 30, 2022 | 11:04 AM

వాచ్‌ల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఫాస్ట్రాక్ స్మార్ట్ వాచ్‌ల రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా బ్లూటూత్ కాలింగ్‌తో కూడిన తొలి స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చింది.

ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ ప్లే ప్లస్ పేరుతో లాంచ్ చేసినఈ స్మార్ట్‌వాచ్‌ను సర్క్యులర్ షేప్ డిజైన్ AMOLED డిస్‌ప్లే, అల్యూమినియమ్ కేస్‌తో రూపొందించారు. బ్లూటూత్ కాలింగ్ కోసం ఇందులో ఇన్‌బుల్ట్ స్పీకర్, మైక్‌ను అందించారు.

ఈ వాచ్‌లో హార్ట్‌రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ ట్రాకర్(SpO2), బ్లడ్ ప్లజర్ మానిటరింగ్‌తో పాటు మరికొన్ని హెల్త్ ఫీచర్లను అందించారు.

ఈ స్మార్ట్ వాచ్‌ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఏడు రోజుల నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. వర్కౌట్స్ సంబంధించిన పలు అధునాతన ఫీచర్లు ఈ వాచ్ సొంతం.

ధర విషయానికొస్తే ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ ప్లే + వాచ్ ధర రూ. 6,995గా ఉంది. ఫాస్ట్రాక్ వెబ్‌సైట్‌తో పాటు, ఫాస్ట్రాక్ అవుట్‌లెట్స్‌లో అందుబాటులో ఉంది.




