అంజీర్ పండ్లలో పొటాషియం, సోడియం, ఫాస్పొరిక్ ఆమ్లం, ఐరన్, విటమిన్లు వంటి అనేక పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఖాళీ కడుపుతో అంజీర పండ్లను తినడం వల్ల రక్తపోటు సమస్యలు రావు. రక్తపోటును ఇది అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని రక్తపోటును నియంత్రిస్తాయి. అలాగే గుండెకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.