- Telugu News Photo Gallery Eating vegetarian food is better for health than non veg, Check Here is Details in Telugu
Vegetarian Foods Uses: నాన్ వెజ్ కంటే శాకాహారం తినడమే ఆరోగ్యానికి మేలు..
నాన్ వెజ్ అంటే చాలా మందికి ప్రాణం. నాన్ వెజ్ తినడం బలం అనుకుంటారు. కానీ అది తినడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్నీ కావు. నాన్ వెజ్ ఎక్కువగా తింటే గుండెపై ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి నాన్ వెజ్ కంటే శాకాహారం తినడమే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..
Updated on: Jan 31, 2025 | 7:33 PM

నాన్ వెజ్ అంటే చాలా మంది ఇష్ట పడి మరీ తింటారు. ముక్క లేనిదే ముద్ద దిగదు. ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో మాంసాహారంతో చేసిన ఫుడ్స్ తీసుకుంటారు. నాన్ వెజ్ వల్ల కూడా శరీరానికి కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయినా మాంసాహారం కంటే శాకాహారం తినడమే ఆరోగ్యానికి మేలని సైంటిస్టులు చెబుతున్నారు.

ఈ మధ్య కాలంలో చాలా మంది గుండె పోటుతో ఎక్కువగా మరణిస్తున్నారు. గుండె ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండి పని చేయాలంటే శాకాహారమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శాకాహారం తీసుకోడం వల్ల గుండెకు ఏంతో మేలు జరుగుతుందని అంటున్నారు.

శాకాహారంలో ఎక్కువగా కొవ్వు పదార్థాలు అనేవి ఉండవు. వీటి వల్ల రక్త ప్రసరణ అనేది సజావుగా సాగుతుంది. కొవ్వు ఉన్న ఆహారాలు తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది రక్త ప్రసరణకు అడ్డంకిగా మారుతుంది. దీంతో గుండె పని తీరు అనేది తగ్గుతుంది.

శాకాహారం తీసుకోవడం వల్ల బీఎంఐ రేటు కూడా పెరుగుతుంది. వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువగా తినేవారు ఎక్కువ రోజులు బతుకుతారు. ఓబెసిటీ, అధిక బరువు, బ్యాడ్ కొలెస్ట్రాల్, రక్త పోటు, డయాబెటీస్ అనేవి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

శాకాహారం ద్వారా ఫైబర్, ప్రోటీన్ కూడా ఎక్కువగా లభిస్తాయి. కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. దీని వల్ల ఎలాంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవు. శాకాహారులు జంక్ ఫుడ్‌కి కూడా దూరంగా ఉంటే మరింత మంచిది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




