- Telugu News Photo Gallery Eating chewing gum like this can control excess weight, Check Here is Details in Telugu
Chewing Gum for Weight Loss: చూయింగ్ గమ్‌తో అధిక బరువుకు చెక్.. ఎలాగంటే..
అధిక బరువు అనేది అనేక సమస్యలకు కారణం అవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. కాబట్టి బరువును ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. బరువును అదుపులో ఉంచేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. తాజాగా మీ కోసం మరో ఇంట్రెస్టింగ్ టిప్ తీసుకొచ్చాం..
Updated on: Jan 03, 2025 | 11:25 AM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. అధిక బరువు, ఊబకాయం కారణంగా అనేక ఇతర అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా డయాబెటీస్, బీపీ సమస్యలు పెరుగుతాయి. ఇవి వచ్చాయంటే తగ్గించుకోవడం కష్టం.

కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలి. బరువును కంట్రోల్ చేసేందుకు ఇప్పటికే ఎన్నో రకాల హోమ్ రెమిడీస్, ఎక్సర్‌సైజులు, ఆహారాల గురించి తెలుసుకున్నాం. తాజాగా చూయింగ్ గమ్ నమలడం వల్ల కూడా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

చూయింగ్ గమ్‌ని సరదాగా, నోటి ఫ్రెష్ నెస్ కోసం నములుతూ ఉంటారు. కానీ చూయింగ్ గమ్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా ఒత్తిడి అనేది కంట్రోల్ అవుతుంది. మెదడు పని తీరు కూడా మెరుగు పడుతుంది. పనిపై శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతాయి.

చూయింగ్ గమ్ నమలడం వల్ల దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయని, దంతక్షయం రాకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇదే చూయింగ్ గమ్‌తో అధిక బరువు నుంచి కూడా ఉపశమనం కలుగుతుందట.

ప్రతి రోజూ రెండు సార్లు ఆకలిగా ఉన్నప్పుడు చూయింగ్ గమ్ నమలడం వల్ల.. ఆకలి చచ్చిపోతుందట. చూయింగ్ గమ్ నమిలిన తర్వాత నీళ్లు ఎక్కువగా తాగాలనిపిస్తుంది. దీంతో ఆహారాన్ని మితంగా తీసుకుంటారు. క్యాలరీలు కూడా తగ్గుతాయి. ఈ రకంగా వెయిట్ లాస్ అవుతారు. షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




