Bilva Patra: మారేడు ఆకులు తింటే ఇన్ని రోగాలు నయం అవుతాయట..
మారేడు పత్రాలను కేవలం పూజలకు మాత్రమే ఉపయోగిస్తారు అనుకుంటే పొరపాటే. బిల్వ పత్రాలతో ఎన్నోరకాల అనారోగ్య సమస్యలను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. బిల్వ పత్రాలను నేరుగా తిన్నా, నీటిలో మరిగించి తీసుకున్నా ఈ సమస్యలు కంట్రోల్ అవుతాయి..
Updated on: Nov 09, 2024 | 5:50 PM

మారేడు ఆకులు అనుగానే ఆ పరమ శివుడే అందరికీ గుర్తొస్తాడు. మారేడు దళాలతో ఆ శివుడికి పూజ చేయడం, అభిషేకం చేస్తూ ఉంటారు. కానీ మారేడు దళాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. శరీరానికి ఉపయోగపడే ఎన్నో సమస్యలను నయం చేయడంలో ఈ ఆకులు ఎంతో చక్కగా పని చేస్తాయి.

రోజుకు ఒక ఆకు తిన్నా కూడా ఎన్నో దీర్ఘకాలిక సమస్యలకు బైబై చెప్పొచ్చు. బిల్ల పత్రాన్ని పరగడుపున తినడం వల్ల పలు ఆరోగ్య లాభాలు ఉన్నాయి. బిల్వ పత్రాలను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది.

రోగ నిరోధక శక్తి ఎక్కువా ఉంటే త్వరగా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. ఎప్పుడూ యాక్టీవ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. కాబట్టి బిల్వ పత్రాలను తింటే ఇమ్యూనిటీ బల పడుతుంది.

మారేడు పత్రాలు తింటే జీర్ణ క్రియ కూడా మెరుగు పడుతుంది. ఎలాంటి గ్యాస్, అజీర్తి, మలబద్ధకం, కడుపు ఉబ్బరం, నొప్పి సమస్యల ఉన్నా తగ్గుతాయి. ఈ ఆకులను శుభ్రంగా కడిగి మరిగించిన నీరు కూడా తాగవచ్చు.

బిల్వ పత్రాలను వేసి మరిగించిన నీరు తాగడం వల్ల పేగులు కూడా క్లీన్ అవుతాయి. మూత్ర పిండాలు, గుండె ఆరోగ్యంగా పని చేస్తాయి. డయాబెటీస్ అనేది అదుపులో ఉంటుంది. బీపీ తగ్గుతుంది. కాలేయం కూడా ఆరోగ్యంగా పని చేస్తుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)




