- Telugu News Photo Gallery Cricket photos 6 Players Sunrisers Hyderabad May Target In IPL 2025 Mega Auction
SRH: ఈసారి మంచి ప్లేయర్స్‌పై కన్నేసిన కావ్య పాప.. మెగా వేలంలో కాసులు కురవాల్సిందే
వచ్చే ఏడాది ఐపీఎల్‌కు గానూ జరగనున్న మెగా వేలానికి ముహూర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ ఆక్షన్ ఈ నెల 24, 25 తేదీల్లో జరుగుతుంది. ఈ మెగా వేలంలో ఏయే ఆటగాళ్లను సొంతం చేసుకోవాలన్న దానిపై ఇప్పటికే ఫ్రాంచైజీలు మల్లగుల్లాలు పడుతున్నాయి.
Updated on: Nov 09, 2024 | 8:15 PM

గతేడాది ఫైనల్ వరకు వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఎలాగైనా కప్ కొట్టాల్సిందేనని డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే పదునైన వ్యూహాలతో మెగా వేలంలోకి రాబోతోంది హైదరాబాద్ ఫ్రాంచైజీ. ఐదుగురు ప్లేయర్స్‌ను రూ. 75 కోట్లకు రిటైన్ చేసుకున్న కావ్య మారన్.. మిగిలిన 20 మందిని రూ. 45 కోట్లకు కొనుగోలు చేసేందుకు సిద్దమైంది. మంచి ప్లేయర్స్‌ను వేలంలో దక్కించుకోవాలని చూస్తోందట. ఈ ఆరుగురు ప్లేయర్స్‌పై సన్ రైజర్స్ టీం గురి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

టి నటరాజన్: 33 ఏళ్ల లెఫ్టార్మ్ పేసర్ IPL 2024లో 19 వికెట్లు తీశాడు. SRH అతనిని తిరిగి తీసుకునే ఛాన్స్ ఉంది.

వెంకటేష్ అయ్యర్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అవసరం. వెంకటేష్ అయ్యర్ ఈ స్థానాన్ని భర్తీ చేయవచ్చు.

మహ్మద్ సిరాజ్: ఈ భారత పేసర్ 2015-17 మధ్య SRH కోసం ఆడాడు. ఈ హైదరాబాదీ పేసర్ మళ్లీ హైదరాబాద్ జట్టులోకి రావచ్చు.

రవిచంద్రన్ అశ్విన్: ఈ దిగ్గజ స్పిన్నర్ తన కెరీర్ చివరి దశలోకి వచ్చేశాడు, కానీ ఇతడి స్మార్ట్ స్పిన్ జట్టుకు చాలా అవసరం.

అబ్దుల్ సమద్: 2020 నుంచి SRHతో ఉన్న సమద్.. ఫినిషర్‌గా ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతన్ని తక్కువ-ధరకు మళ్లీ హైదరాబాద్ జట్టు ఎంచుకునే ఛాన్స్ ఉంది.

సమీర్ రిజ్వీ: సమీర్ రిజ్వీ SRH రాడార్‌లో ఉన్న మరొక పవర్ హిట్టర్. అతను దేశీయ క్రికెట్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు.





























