- Telugu News Photo Gallery A washing machine can be cleaned like this without spending a rupee, Check Here in Telugu
Cleaning Tips: వాషింగ్ మెషీన్‌ని రూపాయి ఖర్చు లేకుండా ఇలా క్లీన్ చేయవచ్చు..
వాషింగ్ మెషీన్‌ని ప్రస్తుత కాలంలో చాలా మంది ఉపయోగిస్తున్నారు. వర్క్ ఉమెన్స్ అందరూ చాలా వరకు వాషింగ్ మెషీన్ యూజ్ చేస్తున్నారు. ఇందులో బట్టలు ఉతకడం చాలా సింపుల్. అయితే చాలా మందికి వాషింగ్ మెషీన్‌ని సరిగా చేయరు. కానీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా మనం వాషింగ్ మెషీన్ క్లీన్ చేసుకోవచ్చు..
Updated on: Nov 09, 2024 | 5:24 PM

వాషింగ్ మెషీన్ అనేది ఇప్పుడు నిత్యవసర వస్తువుగా మారిపోయింది. గ్రామాల్లో సంగతి ఎలా ఉన్నా.. పట్టణాల్లో మాత్రం వాషింగ్ మెషీన్ లేనిదే పని కాదు. ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలో అయినా చిన్న వాషింగ్ మెషిన్ ఉండాల్సిందే. వాషింగ్ మెషీన్ ఉంటే బట్టల గురించి పెద్దగా దిగులు ఉండదు.

వాషింగ్‌లో బట్టలను ఈజీగా ఉతుక్కోవచ్చు. ఇందులో బట్టలు వేసి వేరే పని హాయిగా చేసుకోవచ్చు. బట్టలను శుభ్ర పరుస్తున్న వాషింగ్ మెషీన్‌ని అసలు మీరు క్లీన్ చేస్తున్నారా? బట్టలు ఉతికేంత వరకే వాషింగ్ మెషీన్. ఆ తర్వాత దాని సంగతే పట్టించుకోరు.

వాషింగ్ మెషీన్ క్లీన్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే మీ బట్టలు మురికి అవుతాయి. దీన్ని క్లీన్ చేసేందుకు సపరేట్‌గా లిక్విడ్స్ లేదంటే పౌడర్స్ కొనాల్సి ఉంటుంది. కానీ ఆ అవసరం లేకుండా ఖర్చు లేకుండా వాషింగ్ మెషీన్‌ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు.

మీరు ఈజీగా ఇంట్లో ఉపయోగించే వెనిగర్, బేకింగ్ సోడాతో క్లీన్ చేసుకోవచ్చు. రెండేసి చిన్న కప్పుల చొప్పున మెషీన్‌లో వెనిగర్, బేకింగ్ సోడా, సాధారణంగా ఉపయోగించే సర్ఫ్ వేయండి. ఆ తర్వాత డ్రమ్ క్లీన్ ఆప్షన్ ఎంచుకోండి. ఇలా చేయడం వల్ల మురికి త్వరగా వెళ్లిపోతుంది.

అదే విధంగా వేడి నీళ్లు ఉపయోగించి కూడా మెషీన్ క్లీన్ చేసుకోవచ్చు. వేడి నీటిలో కొద్దిగా వాషింగ్ మెషీన్ క్లీనింగ్ పౌడర్ లేదంటే పైన చెప్పిన మిశ్రమాన్ని కూడా తీసుకోవచ్చు. వేడి నీళ్లు ఉపయోగించడం వల్ల మురికి మరింత త్వరగా పోతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)




