- Telugu News Photo Gallery Business photos Want to buy a good car, These are the cars that Tata Nexon is competing with, Best cars details in telugu
Best cars: మంచి కారు కొనాలనుకుంటున్నారా..? టాటాా నెక్సాన్‌కు గట్టి పోటీనిస్తున్న కార్లు ఇవే
కొత్త కారు కొనుగోలు చేసేటప్పడు దేన్ని ఎంచుకోవాలనేది చాలా పెద్ద సవాలుగా మారుతుంది. నేడు మార్కెట్ లోకి అనేక కార్లు విడుదలయ్యాయి. ఫీచర్లు, లుక్, సౌకర్యం తదితర వాటితో చాలా మెరుగ్గా ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడానికి అనేక విషయాలను పరిశీలించాలి. ప్రస్తుతం టాటా నెక్సాన్ కారుకు మార్కెట్ లో ఎంతో డిమాండ్ ఉంది. 2017లో విడుదలైన ఈ సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీ కి గ్లోబర్ న్యూకార్ అసెసెమెంట్ ప్రోగ్రామ్ లో 5 స్టార్ రేటింగ్ లభించింది. దీని ధర రూ.7.99 లక్షల (ఎక్స్ ఫోరూమ్) నుంచి రూ.15.79 లక్షలు పలుకుతోంది. అయితే ఇదే సెగ్మెంట్ లో ఇతర కంపెనీల వాహనాలు కూడా లభిస్తున్నాయి. వాటి ధరల వివరాలు, ప్రత్యేకతలు ఇవే..
Srinu |
Updated on: Nov 09, 2024 | 4:40 PM

మూడు రకాల ఇంజిన్ ఎంపికలతో హ్యుందాయ్ వెన్యూ అందుబాటులోకి వచ్చింది. డ్యూయల్ క్లచ్, మాన్యువల్ గేర్ బాక్స్, ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 8.0 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే ఆకట్టుకుంటున్నాయి. ఈ కారు ధర రూ.7.9 లక్షల నుంచి (ఎక్స్ షోరూమ్) రూ.13.5 లక్షలు పలుకుతోంది.

కియా సోనెట్ కారు మూడు రకాల ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో వస్తుంది. 1.2 లీటర్ పెట్రోలు, 1.0 లీటర్ టర్బో పెట్రోలు, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లను అమర్చారు. అలాగే 10.25 అంగుళాల రెండు డిస్ ప్లేలు, యాంబియంట్ లైటింగ్, బోస్ ఆడియో స్పీకర్ సిస్టమ్, ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్ సీ), 360 డిగ్రీ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్ తదితర ఫీచర్లు ఏర్పాటు చేశారు. ఈ కారు రూ.7.9 లక్షల (ఎక్స్ ఫోరూమ్) నుంచి 15.7 లక్షల ధరకు అందుబాటులో ఉంది.

మహీంద్రా ఎక్స్ యూవీ300 కారులో 10.25 అంగుళాల రెండు డిజిటల్ డిస్ ప్లే లు అమర్చారు. ఆరు ఎయిర్ బ్యాగులు, మూడు పాయింట్ సీట్ బెల్టులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లెవెల్ 2 అడాస్, 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్ రాడ్ సెన్సార్ ఆకట్టుకుంటున్నాయి. ఈ కారు రెండు పెట్రోలు, ఒక డీజిల్ ఇంజిన్ల ఎంపికలో అందుబాటులో ఉంది.

మారుతీ సుజుకీ బ్రెజ్జా కారు పెట్రోలు, సీఎస్జీ ఎంపికలతో అందుబాటులో ఉంది. పెట్రోలు వేరియంట్ లో 1.5 లీటర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. ఐదు స్పీడ్ మాన్యువల్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, ఆరు ఎయిర్ బ్యాగులు, ఈఎస్ పీ, 360 డిగ్రీ కెమెరా, ఆటో డిమ్మింగ్ ఐఆర్ వీఎం, క్రూయిజ్ కంట్రోలు తదితర ఫీచర్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ సన్ రూఫ్, 9 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే, వైర్ లెస్ చార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోలు, కూల్డ్ గ్లోవ్ బాక్స్ అదనపు ప్రత్యేకతలు. ఈ కారు రూ.8.34 లక్షల నుంచి రూ.14.14 లక్షలకు అందుబాటులో ఉంది.

మారుతీ సుజుకి నుంచి విడుదలైన ఫ్రాంక్స్ కారు ఎంతో ఆకట్టుకుంటోంది. దీనిలో ఫ్రంట్ ట్రాన్స్ మిషన్, ఐదు స్పీడ్ ఆటోమేటిక్ మాన్యువల్, ఐదు స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఏర్పాటు చేశారు. ఈఎస్ పీ, 360 డిగ్రీ కెమెరా, హిల్ హుల్డ్ అసిస్ట్, సైడ్ కర్టెన్ ఎయిర్ బ్యాగులు అదనపు భద్రతను అందిస్తాయి. దీని ధర రూ.7.50 లక్షల (ఎక్స్ షోరూమ్ )నుంచి 13.04 లక్షల వరకూ పలుకుతోంది.





























