తిన్న వెంటనే గ్రీన్ టీ తాగితే ప్రమాదంలో పడినట్లే..
ప్రస్తుతం ఆరోగ్యం కోసం చాలామంది గ్రీన్ టీ తాగుతున్నారు. దీని రుచి కొంతమందికి నచ్చకపోయినా ప్రయోజనాల కోసం తాగడం మొదలుపెడుతున్నారు. కాగా ఈ టీ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను మేరుపరుస్తుంది. గ్రీన్ టీ తాగితే టైప్-2 డయాబెటిస్ సమస్య దూరమవుతుంది. అయితే కొంతమంది భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగుతున్నారు. గ్రీన్ టీ ఇలా తాగితే ప్రయోజనలు ఉంటుందా లేదా తెలుసుకుందాం.
Updated on: Jul 21, 2025 | 1:29 PM

ప్రస్తుత జీవనశైలి కారణంగా చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. కాబట్టి అందరూ ఆరోగ్యంపై దృష్టిసారించాలి. ప్రస్తుతం ఆరోగ్యం కోసం చాలామంది గ్రీన్ టీ తాగుతున్నారు. దీని రుచి కొంతమందికి నచ్చకపోయినా ప్రయోజనాల కోసం తాగడం మొదలుపెడుతున్నారు. కాగా ఈ టీ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను మేరుపరుస్తుంది.

గ్రీన్ టీ ఉదయం ఖాళీ కడుపున తీసుకోకూడదు. భోజనం తర్వాత లేదా టిఫిన్‌తో పాటు గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇదే సమయంలో దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పూర్తిగా ప్రభావితం కావడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇది మన శరీరానికి తక్షణ శక్తి కూడా అందిస్తుంది. అయితే, రాత్రి కూడా తిన్న తర్వాత తీసుకోవచ్చు. కానీ, ఖాళీ కడుపున మాత్రం గ్రీన్ టీ తీసుకోకూడదు.

గ్రీన్ టీలో కాఫీన్ ఉండటం వల్ల ఖాళీ కడుపుతో తాగితే కడుపులో అసౌకర్యం, హార్ట్‌బీట్ వేగం కావడం లేదా ఆందోళనగా అనిపించే అవకాశం ఉంటుంది. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే అందులోని కాఫీన్ కారణంగా నిద్రపట్టకపోవడం, మానసిక అసౌకర్యం, అలసట వంటి సమస్యలు ఏర్పడవచ్చు.

గ్రీన్ టీలోని టానిన్ శరీరంలో ఐరన్‌ను తగ్గిస్తుంది. దీనివల్ల మీరు బలహీనంగా ఉంటారు. గ్రీన్ టీలో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు శరీర ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాదు, చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి.

గ్రీన్ టీలో టానిన్లు ఉంటాయి. ఇవి కడుపు ఆమ్లతను పెంచుతాయి. మీకు వికారం లేదా ఉబ్బరం కలిగిస్తాయి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో టానిన్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. అయితే, ఉదయం ఖాళీ కడుపున తీసుకోవడం వల్ల మన కడుపులో యాసిడ్ స్థాయిలు పెరిగిపోతాయి. అంతేకాదు, ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల అజీర్తికి కూడా చేస్తుంది.




