AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాపిల్‌ గింజలతో ఆ సమస్యల ప్రమాదం.. తింటే మీ పని అంతే..

రోజూ ఒక యాపిల్ తింటే పలు రోగాలను దూరం చేసుకోవచ్చునని డాక్టర్లు చెబుతుంటారు. వారు చెప్పినట్లే ఈ పండులో బోలెడు పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని పలు వ్యాధుల నుండి దూరంగా ఉంచుతాయి. ఈ సంగతి పక్కన పెడితే మనలో చాలామంది గింజలు తీసేసి యాపిల్‌ను తింటుంటారు. అయితే కొందరు మాత్రం గింజలు కూడా తినేస్తుంటారు. అయితే ఇలా తినడం వల్ల పలు సమస్యలు తలెత్తుతాయట. దీనికి సంబంధించి యాపిల్ విత్తనాలపై ఇటీవల జరిపిన శాస్త్రీయ పరిశోధనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Prudvi Battula
|

Updated on: Jul 21, 2025 | 1:20 PM

Share
యాపిల్ రోజూ తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని కొవ్వు క‌రిగిపోతుంది. పొట్ట కొవ్వు క‌రుగుతుంది. డ‌యాబెటిస్ రాకుండా యాపిల్ పండ్లు మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. రోజుకు ఒక యాపిల్‌ను తిన‌డం వ‌ల్ల జ్ఞాప‌కశ‌క్తి సైతం పెరుగుతుంది. దీంతో మెద‌డు యాక్టివ్‌గా ఉంటుంది.

1 / 5
ఇది శరీర కణాలకు ఆక్సిజన్ చేరకుండా నిరోధిస్తుంది. అంతే కాదు చిన్న మొత్తంలో సైనైడ్ కూడా శరీరానికి స్వల్పకాలిక నష్టాన్ని కలిగిస్తుంది. ఇది తలనొప్పి, గందరగోళం, అలసట, బద్ధకం వంటి సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో పెద్ద మొత్తంలో సైనైడ్ చేరితే అధిక రక్తపోటు, స్ట్రోక్, మూర్ఛ వంటి తీవ్రమైన సమస్యలు సంభవించవచ్చు.

2 / 5
ఇది శరీరంలోని కణాలకు ఆక్సిజన్ చేరకుండా చేస్తుంది. చిన్న మొత్తంలో సైనైడ్ శరీరానికి స్వల్పకాలిక తేలికపాటి నష్టాన్ని కలిగిస్తుంది. ఇందులో తలనొప్పి, గందరగోళం, అలసట, నీరసం తదితర సమస్యలు తలెత్తుతాయి.

3 / 5
ఇక శరీరంలో సైనైడ్ ఎక్కువగా ఉంటే అధిక రక్తపోటు, స్ట్రోక్స్, మూర్ఛ వంటి తీవ్రమైన సమస్యలు కలుగుతాయి. ఒక్కోసారి కోమాలోకి వెళ్లి మరణం కూడా సంభవించవచ్చు. అమిగ్డాలిన్ పరిమాణం యాపిల్ రకాన్ని బట్టి ఉంటుంది. అమిగ్డాలిన్ ప్రాణాంతకం కానప్పటికీ శరీరానికి హానికరం అని చెప్పుకోవాలి. అందుకే చిన్న పిల్లలకు గింజలు తీసేసిన యాపిల్‌ను తినిపించాలంటున్నారు నిపుణులు.

4 / 5
2015 పరిశోధనల ప్రకారం, ఒక గ్రాము ఆపిల్ గింజలలో అమిగ్డాలిన్ ఒకటి నుంచి నాలుగు మిల్లీగ్రాముల మధ్య ఉంటుంది. ఇది వివిధ రకాల ఆపిల్‌లను బట్టి ఉంటుంది. అయితే, విత్తనాల నుంచి విడుదలయ్యే సైనైడ్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. 50-300 mg హైడ్రోజన్ సైనైడ్ ప్రాణాంతకం కావచ్చు. ఒక గ్రాము ఆపిల్ గింజలో 0.6 mg హైడ్రోజన్ సైనైడ్ ఉంటుంది. అంటే 80 నుంచి 500 గింజలు తింటే మనిషికి ప్రాణాపాయం తప్పదు. ఇక పరిశోధనలో, శాస్త్రవేత్తలు అమిగ్డాలిన్‌ను నివారించడానికి, యాపిల్స్ తినడానికి, యాపిల్ జ్యూస్ తాగే ముందు వాటి విత్తనాలను తొలగించడం మంచిదని సలహా ఇచ్చారు. ముఖ్యంగా పిల్లలకు ఆపిల్ గింజలు తీసిన తర్వాత తినిపించాలి.

5 / 5
Follow Us