Yoga for Skin: ఈ యోగాసనాలు వేస్తే.. మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుదంతే..
యోగాతో ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. ప్రత్యేకంగా మళ్లీ చెప్పాల్సిన పని లేదు. యోగా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యోగాతో నయం లేని సమస్యలే ఉండవు. మీ ముఖం అందంగా, కాంతి వంతంగా మెరిసిపోవాలంటే ఏలాంటి యోగాసనాలు వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. యోగాలోని అనేక రకాల యోగా భంగిమలు చర్మానికి మేలు చేస్తాయి. ఈ యోగాసనాలను తరచూ క్రమం తప్పకుండా వేస్తే.. మీ ముఖం అందంగా..
Updated on: Apr 08, 2024 | 5:45 PM

యోగాతో ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. ప్రత్యేకంగా మళ్లీ చెప్పాల్సిన పని లేదు. యోగా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యోగాతో నయం లేని సమస్యలే ఉండవు. మీ ముఖం అందంగా, కాంతి వంతంగా మెరిసిపోవాలంటే ఏలాంటి యోగాసనాలు వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

యోగాలోని అనేక రకాల యోగా భంగిమలు చర్మానికి మేలు చేస్తాయి. ఈ యోగాసనాలను తరచూ క్రమం తప్పకుండా వేస్తే.. మీ ముఖం అందంగా మెరిసిపోతుంది. ప్రత్యేకంగా మీరు ఫేషియల్స్ వంటివి చేయించుకోవాల్సిన అవసరం ఉండదు.

చర్మ కాంతిని పెంచడంలో పశ్చిమోత్తాసనం బాగా పని చేస్తుంది. ఇది వేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ముఖంపై ముడతలు, మొటిమలు రాకుండా ఉంటాయి. ధనురాసనం వేయడం వల్ల మీ ముఖం తేజస్సు అనేది పెరుగుతుంది. ప్రతి రోజూ ఈ ఆసనం వస్తే శరీరం డీటాక్సిఫై అవుతుంది.

అధోముఖ శ్వానాసనం వేయడం వల్ల శరీరానికి, చర్మానికి కూడా చాలా లాభాలు ఉన్నాయి. రక్త ప్రసరణ బాగా జరిగి.. చర్మం కాంతి మెరుగు పడుతుంది. అలాగే మత్స్యాసనం వేయడం వల్ల కూడా రక్త ప్రసరణ బాగా జరిగి.. చర్మం మెరిసిపోతుంది.

అదే విధంగా సర్వంగాసనం, శవాసనం వేయడం వల్ల చర్మానికి చాలా మేలు జరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన అనేవి పూర్తిగా తగ్గుతాయి. దీంతో ముఖంపై చిరునవ్వు, తేజస్సు పెరుగుతుంది. అదే విధంగా మీ ముఖం కాంతివంతంగా కూడా తయారవుతుంది.




