- Telugu News Photo Gallery Are there so many benefits of hot oil massage? check here is details in Telugu
Hot Oil Massage: హాట్ ఆయిల్‌తో మసాజ్ చేస్తే.. ఇన్ని లాభాలు ఉన్నాయా?
సాధారణంగా ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటూ ఉంటారు. దీంతో ఒళ్లు నొప్పులు వంటివి తగ్గుతాయి. బాడీ రిలాక్స్ అవుతుంది. చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే వేడి నూనెతో మసాజ్ చేసుకుంటే మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గోరువెచ్చటి నూనెతో శరీరంపై మసాజ్ చేస్తే.. కండరాలు అనేవి సడలించడానికి సహాయ పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన సమస్యలు..
Updated on: Apr 08, 2024 | 4:40 PM

సాధారణంగా ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటూ ఉంటారు. దీంతో ఒళ్లు నొప్పులు వంటివి తగ్గుతాయి. బాడీ రిలాక్స్ అవుతుంది. చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే వేడి నూనెతో మసాజ్ చేసుకుంటే మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గోరువెచ్చటి నూనెతో శరీరంపై మసాజ్ చేస్తే.. కండరాలు అనేవి సడలించడానికి సహాయ పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన సమస్యలు తగ్గుతాయి. మానసిక సంతోషం పెరుగుతుంది. కీళ్ల నొప్పులు, వెన్ను, తల నొప్పులు తగ్గుతాయి.

వేడి నూనెతో మసాజ్ చేస్తే.. రక్త ప్రసరణ అనేది పెరుగుతుంది. దీంతో కణాలకు ఆక్సిజన్, పోషకాలను అందించడంలో హెల్ప్ చేస్తుంది. వేడి నూనెతో మసాజ్ చేయడం వల్ల చర్మం ఛాయ కూడా పెరుగుతుంది. చర్మం సాఫ్ట్‌గా, హైడ్రేట్‌గా మారుతుంది. దీంతో కాంతివంతంగా కనిపిస్తుంది.

అదే విధంగా నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడేవారు గోరు వెచ్చటి నూనెతో మసాజ్ చేయించుకుని, గోరు వెచ్చటి నీళ్లతో స్నానం చేయాలి. దీంతో కండాలు రిలాక్స్ అయి.. మీకు కూడా హాయిగా నిద్ర పడుతుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.

హాట్ ఆయిల్ మసాజ్ అనేది అన్ని వయస్సుల వారికి సూట్ అవుతుంది. అయితే గర్భిణీ స్త్రీలు, గాయాలు, రక్త స్రావం, రుగ్మతలు ఉన్నవారు మసాజ్ చేయించుకోకూడదు.




